- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అది నా లైఫ్‌లో స్పెషల్ చాప్టర్ అవుతుందని నమ్ముతున్నా.. కొత్త హింట్ ఇచ్చిన మీనాక్షి చౌదరి
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి.. అనతి కాలంలోనే స్టార్ ఈమేజ్‌ను సొంతం చేసుకుంది.

దిశ, సినిమా: ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి.. అనతి కాలంలోనే స్టార్ ఈమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం, లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో ఈ క్రేజ్ మరింత పెంచుకున్న మీనాక్షి ప్రజెంట్ వరుస చిత్రాలు అనౌన్స్ చేస్తూ సందడి చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు రెండు, మూడు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అలాగే.. చిరంజీవి విశ్వంభరలో కూడా తాను భాగం అయినట్లు చెప్పుకొచ్చింది మీనాక్షి.
‘ఇలాంటి పాత్రలే చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నటిగా ఎలాంటి పాత్ర వచ్చినా చేయాలి.. అప్పుడు మాత్రమే మన నటన విలువ తెలుస్తుంది. అయితే.. లక్కీ భాస్కర్ చిత్రంలో తల్లి రోల్ చేశాను. ఆ కథ, పాత్ర నాకు చాలా బాగా నచ్చాయి. అందుకే చేశాను. కానీ ఇకపై పిల్లల తల్లిగా కనిపించే పాత్రలు వస్తే మాత్రం చేయను.. మొహమాటం లేకుండా నో చెబుతా.. కానీ పెద్ద హీరోలతో కలిసి సినిమాలు చేయడానికి మాత్రం నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అలా చేసే అవకాశం వస్తే దాన్ని కొత్త జానర్‌గా తీసుకుంటాను. సంక్రాంతికి వస్తున్నాం మూవీ షూటింగ్‌ను బాగా ఎంజాయ్ చేశాం. ఇక మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న విశ్వంభర సినిమా నా కెరీర్‌లో స్పెషల్ ఛాప్టర్‌గా నిలుస్తుందని నమ్ముతున్నాను ’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక రూమర్స్‌పై స్పందిస్తూ.. నా గురించి ఏదైనా చెప్పాలంటే నేనే స్వయంగా చెబుతా.. నాకూ సోషల్ మీడియా ఉంది.. కాబట్టి ఇతరులు రూమర్స్ సృష్టించాల్సిన అవసరం లేదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది మీనాక్షి. ప్రజెంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. విశ్వంభర లో తాను భాగం అయినట్లు కన్ఫర్మ్ అయింది.






