గుక్కతిప్పుకోకుండా వేమన పద్యం చెప్పిన కీర్తి సురేష్.. వీడియో వైరల్

by Kodari Anjali |

నేను శైలజ (Nenu shailaja) చిత్రంతో టాలివుడ్ ఇండస్ట్రీకి ఎంట్రి ఇచ్చింది అద్భుత నటి కీర్తి సురేష్ (Keerthy Suresh).

గుక్కతిప్పుకోకుండా వేమన పద్యం చెప్పిన కీర్తి సురేష్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: నేను శైలజ (Nenu shailaja) చిత్రంతో టాలివుడ్ ఇండస్ట్రీకి ఎంట్రి ఇచ్చింది అద్భుత నటి కీర్తి సురేష్ (Keerthy Suresh). ఈ ముద్దుగుమ్మ యాక్టింగ్, అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేసుకుంది. సినీ పరిశ్రమలో అలాగే తెలుగు ప్రజల్లో మహానటిగా పేరు సంపాదించుకుంది.

ఏకంగా కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) చిత్రంలోనే నటించే చాన్స్ దక్కించుకుంది. మెగాస్టారు చెల్లెలిగా భోళా శంకర్ సినిమాలో నటించి మెప్పించింది. అలాగే సీనియర్ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) కు సోదరిగా కూడా నటించి జనాలకు కన్నీళ్లు తెప్పించింది. వీటితో పాటుగా నేను లోకల్ (Nenu lokal), మిస్ ఇండియా (Miss India), మహానటి, రంగ్ దే (Rang dhe)వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో అద్భుతంగా నటించింది.

ఇటు టాలీవుడ్ లో దూసుకుపోతూనే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే బాలీవుడ్ ప్రముఖ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) సరసన అవకాశం కొట్టేసింది. వీరి జోడితో తెరకెక్కిన బేబీ జాన్ చిత్రం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇటు సినిమాల్లో అవకాశాలు అందుకుంటూనే మరోవైపు ప్రియుడు ఆంటోని (Antony)ని పెళ్లాడింది. ఇరు కుటుంబ సభ్యుల నడుమ అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. ప్రియుడితో కలిసి దిగిన ఫొటోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలోని ఫ్యాన్స్ తో షేర్ చేసూ ఉంటుంది.

అయితే కీర్తి సురేష్ త్వరలో ఉప్పు కప్పురంబు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ సెటైరికల్ కామెడీ డ్రామాలో సుహాస్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. శశి దర్శకత్వంలో తెరక్కుతోన్న ఈ చిత్రాన్ని రాధికా ఎల్ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ జులై 4 వ తేదీన తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుందని మేకర్స్ ప్రకటించారు. అయితే నిన్న ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేయగా.. భారీ రెస్పాన్స్ లభిస్తోంది. అయితే కీర్తి సురేష్ ఈవెంట్‌లో గుక్కతిప్పుకోకుండా వేమన పద్యం అయిన ‘ఉప్పు కప్పురంబు’ పద్యాన్ని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story