- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రామ్ చరణ్ అంటే పడిచచ్చిపోతున్న హీరోయిన్.. ఎంత క్యూట్‌గా తనలోని ప్రేమను బయటపెట్టిందో చూడండి!

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు హీరోయిన్ కావ్య థాపర్ (Kavya Thapar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మోడలింగ్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మాయ పేరేమిటో చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే తన అద్బుతమైన నటనతో నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ బ్యూటీ నటనకు మంచి మార్కులే పడ్డప్పటికీ మూవీ మాత్రం నార్మల్ టాక్ సొంతం చేసుకుంది.
తర్వాత తమిళంలో కూడా అవకాశాలు దక్కించుకుంది. అయినప్పటికీ కావ్య థాపర్‌కు అంతగా కలిసి రాలేదు. దీంతో మళ్లీ తెలుగు సినిమాల బాట పట్టింది ఏకంగా ఒకే సంవత్సరంలో టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) సరసన ఈగల్, సందీప్ కిషన్(Sandeep Kishan)తో ఊరు పేరు భైరవకోన, ఎనర్జిటిక్ రామ్ పోతినేని (Energetic Ram Pothineni) సరసన డబుల్ ఇస్మార్ట్ సినిమాల్లో అవకాశం దక్కించుకుంది.
వీటితో పాటు ఈ ముద్దుగుమ్మ గోపీచంద్ కీలక పాత్రలో నటించిన విశ్వం సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం దక్కించుకుంది. కానీ ఇందులో ఊరు పేరు భైరవకోన మూవీ ఒక్కటి మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ మూవీకి గ్నీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే.. కావ్య థాపర్ పలు ఇంటర్వ్యూల్లో చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఫేవరెట్ హీరో ఎవరని ప్రశ్న ఎదురవ్వగా.. రామ్ చరణ్ (Ram Charan)అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. తన ఫస్ట్ క్రష్ కూడా చరణ్ అని వెల్లడించింది. తను చాలా క్యూట్‌గా నవ్వుతారని పేర్కొంది. మొత్తానికి కావ్య మనసులో మాట బయటపెట్టిందని, చరణ్ అంటే ఎంత లవో అంటూ మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ప్రజెంట్ కావ్య థాపర్ క్యూట్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.