బేబీ నిర్మాత సలహా పాటిస్తున్న హీరోయిన్.. ఆ పని చేస్తున్న ఫొటోలు షేర్ చేయడంతో ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

by Hamsa |   ( Updated:2025-04-15 06:24:16.0  )
బేబీ నిర్మాత సలహా పాటిస్తున్న హీరోయిన్.. ఆ పని చేస్తున్న ఫొటోలు షేర్ చేయడంతో  ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ నిర్మాత ఎస్‌కేఎన్(SKN) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన ‘బేబీ’ (baby) సినిమాకు నిర్మాతగా వ్యవహరించి హిట్ అందుకోవడంతో పాటు ఫుల్ క్రేజ్ దక్కించుకున్నారు. అయితే ఎస్‌కేఎన్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇక ఇటీవల యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya )పై పలు వివాదాస్పద కామెంట్లు చేసి చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. ఇక ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపాయి. దీంతో ఆయన తన ఉద్దేశం అది కాదని.. 25మంది తెలుగు హీరోయిన్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని నిర్ణయించుకున్నట్లు వివరణ ఇచ్చాడు.

అలాగే తెలుగు రాని హీరోయిన్లను నేర్చుకోమని సలహా కూడా ఇచ్చారు. ఎస్‌కేఎన్ పలు ఈవెంట్స్‌లో పాల్గొంటూ కూడా ఇదే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారు. అయితే ఇటీవల సంపుర్ణేష్ బాబు (Sampoornesh Babu)హీరోగా నటిస్తున్న ‘సోదరా’ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత ఎస్‌కేఎన్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంతేకాకుండా ఇందులో హీరోయిన్‌గా నటించిన ఆర్తీ గుప్తాకు కూడా అదే సలహా ఇచ్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఆర్తి గుప్తా(Arti Gupta) ఎస్‌కేఎన్ చెప్పినట్లుగానే తెలుగు నేర్చుకుంటున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ఆయనకు సంతోష పరిచింది. ఆయనే తనకు స్పూర్తి అంటూ ఓ పోస్ట్ పెట్టి అందరినీ ఫిదా చేసేసింది. ఇక ఈ విషయంపై నిర్మాత కూడా స్పందించారు. ఆయన విషెస్ చెప్తూ ఆమె పోస్టులకు రీపోస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండటంతో అది చూసిన వారంతా బేబీ నిర్మాతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.



Next Story

Most Viewed