‘చిలక’ అంటూ హీరోయిన్‌ను అవమానించిన డైరెక్టర్.. పోస్ట్ పెట్టి మరీ పరువు తీసిన బ్యూటీ.. ఇండస్ట్రీలో దుమారం

by Sujitha Rachapalli |

* చిలక అంటూ హీరోయిన్‌ను అవమానించిన డైరెక్టర్ * పోస్ట్ పెట్టి పరువు తీసిన యంగ్ బ్యూటీ * ఇండస్ట్రీలో దుమారం రేపుతున్న ఇష్యూ

‘చిలక’ అంటూ హీరోయిన్‌ను అవమానించిన డైరెక్టర్.. పోస్ట్ పెట్టి మరీ పరువు తీసిన బ్యూటీ.. ఇండస్ట్రీలో దుమారం
X

దిశ, వెబ్ డెస్క్ : యంగ్ హీరోయిన్ దివ్య భారతి డైరెక్టర్‌పై సంచలన ఆరోపణలు చేసింది. GOAT.. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్.. సినిమా షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న అవమానాలను బయటపెట్టింది. సుడిగాలి సుధీర్ హీరోగా వస్తున్న ఈ మూవీలో ఆమె హీరోయిన్‌గా చేయగా.. దర్శకుడు నరేష్ కుప్పిలి ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డైరెక్టర్ తనను ‘చిలక’ అని పిలుస్తూ సెక్సిస్ట్ కామెంట్స్ చేశాడని.. ఇది హార్మ్ లెస్ జోక్ అస్సలు కాదని.. మహిళలపై పెరిగిన ద్వేషం, వివక్షకు అద్దం పడుతుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. కేవలం ఒక్కసారి మాత్రమే ఇలా చేయలేదని.. చాలా సార్లు ఇలాంటి అవమానకరమైన పదాలు వినియోగించాడని చెప్పింది.

ఇది తప్పు అని తెలిసినా.. అక్కడే ఉన్న హీరో సుడిగాలి సుధీర్ జోక్యం చేసుకోలేదని చెప్పింది. ఆయన మౌనంగా ఉండటం మరింత బాధ కలిగించిందని తెలిపింది. ఇలాంటి మౌనం ఈ టాక్సిక్ కల్చర్ ఇంకో రోజు బతికి ఉండేందుకు కారణమైందని విమర్శించింది.

కాగా GOAT సినిమా 2023లోనే లాంచ్ అయింది. కానీ షూటింగ్ టైమ్‌లో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా డైరెక్టర్ నరేష్‌ను రిమూవ్ చేశారు. ప్రొడ్యూసరే దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. దీంతో నరేష్ సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ కామెంట్స్ చేస్తుండటంతో.. ఆ స్క్రీన్ షాట్స్ పెట్టి మరీ పరువు తీసింది హీరోయిన్.

Next Story