Disha Patani: బాలీవుడ్‌లో దూసుకుపోతున్న దిశా పటానీ.. అమ్మడు క్రేజ్‌కు ఫ్యాన్స్ ఫిదా

by Chukka Sudharani |   (  Updated:2025-09-02 16:54:41  IST  )

‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని.. తెలుగులో అంతగా గుర్తింపు తెచ్చుకోనప్పటికీ బాలీవుడ్‌లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు అనౌన్స్ చేస్తుంది.

Disha Patani: బాలీవుడ్‌లో దూసుకుపోతున్న దిశా పటానీ.. అమ్మడు క్రేజ్‌కు ఫ్యాన్స్ ఫిదా
X

దిశ, సినిమా: ‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని.. తెలుగులో అంతగా గుర్తింపు తెచ్చుకోనప్పటికీ బాలీవుడ్‌లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు అనౌన్స్ చేస్తుంది. ఇక గతేడాది వచ్చిన ‘కల్కి’ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు మరోసారి ప్రభాస్‌తో జత కట్టేందుకు సిద్ధం అయింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్‌గా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో బిజీగా ఉంటూనే మరో మూవీలో జాయిన్ అయ్యింది ఈ బ్యూటీ.

దిశా పటానీ బాలీవుడ్‌లో విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతుంది. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరో కాగా.. త్రిప్తి డిమ్రి, నానా పటేకర్, రణదీప్ హుడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ మూవీలో దిశా పటానీ అతిధి పాత్రకు ఎంపిక అయింది. అంతే కాకుండా.. రీసెంట్‌గా షూటింగ్‌లో కూడా జాయిన్ అయినట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ అవుతుండగా.. బాలీవుడ్‌లో దిశాకు ఉన్న క్రేజ్ చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. లింక్

Next Story