- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Avneet Kaur: ఇంతకన్నా ఏం చెప్పలేను.. క్రికెటర్ విరాట్‌తో ప్రేమాయణంపై స్పందించిన హీరోయిన్
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) లైక్ కొట్టడంతో సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెంచేసుకుని వైరల్‌గా మారిపోయింది హీరోయిన్ అవ్‌నిత్ కౌర్.

దిశ, సినిమా: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) లైక్ కొట్టడంతో సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెంచేసుకుని వైరల్‌గా మారిపోయింది హీరోయిన్ అవ్‌నిత్ కౌర్. దీంతో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉన్నట్లు నెట్టింట గట్టిగానే ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పటికే దీనిపై స్పందించిన విరాట్.. ‘ఇన్‌స్టాలోని ఫీడ్‌ను క్లియర్ చేస్తుండగా.. అనుకోకుండా లైక్ బటన్ ప్రెస్ అయింది’ అని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ ఇష్యూ జరిగిన ఇన్ని రోజులకు తాజాగా స్పందించింది అవ్‌నిత్ కౌర్ (Avneet Kaur).
ఆమె నటిస్తున్న ‘లవ్ ఇన్ వియత్నాం’ సినిమా ప్రమోషన్స్‌లో ఈ ఇష్యూపై మాట్లాడుతూ.. ‘సామాన్యుల నుంచే కాకుండా సెలబ్రిటీల నుంచి కూడా లవ్ రావడం సంతోషం.. లవ్ ఎప్పుడూ దొరుకుతూనే ఉండాలి.. నేను ఇంతకు మించి చెప్పలేను’ అని తెలిపింది. ప్రజెంట్ అవ్‌నిత్ కౌర్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అసలు ఉందని చెప్తున్నావా.. లేదు అని చెప్తున్నావా అంటూ షాకింగ్ రియాక్షన్స్ ఇస్తున్నారు నెటిజన్లు. లింక్






