- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బర్త్ డే కేక్‌తో పాటు కుక్క క్యూట్ లుక్స్ పంచుకున్న నటి.. ఎన్నేళ్లలోకి అడుగుపెట్టిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే ..?
టాలీవుడ్ హీరోయిన్ అంజలి (Anjali) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ అంజలి (Anjali) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ నటి తమిళంలో జీవా (Jiva) సినిమాతోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇదే మూవీ తెలుగులో డేర్ (Dare) అనే పేరుతో వచ్చింది. తర్వాత ఈ అమ్మడు 2006 లో ఫొటో మూవీలో అవకాశం దక్కించుకుంది.
తర్వాత ప్రేమలేఖ రాశా, షాపింగ్ మాల్ (Shopping mall) సినిమాల్లో తన ప్రతిభ కనబర్చి నటనతో ప్రేక్షకులందరినీ అబ్బురపరిచింది. ఈ అద్భుతమైన టాలెంట్ చూసిన మురుగదాస్ జర్నీ (Journey) చిత్రంలో అవకాశం ఇచ్చాడు. ఇందులో మధుమతి పాత్రలో కనిపించి.. డామినేటింగ్ క్యారెక్టర్తో అందరినీ ఆకట్టుకుంది.
ముఖ్యంగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' (Seethamma Walkitlo Sirimalle Chettu) సినిమాలో సీతగా అవకాశం దక్కించుకుని.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అమాయకంగా, చిలిపి అమ్మాయిలా నటించి మెప్పించింది. వీటితో పాటుగా బలుపు సినిమాలో శృతిహాసన్ (Shruti Haasan ) తో స్క్రీన్ షేర్ చేసుకుంది. కత్తరదు తమిళ్, హుంగనాసు (Hunganasu), ఆయుధం సీవోం..
అంగడి తేరు, మాగిజ్చి, రెట్టెసుజి (Rettaisuji), పయ్యన్స్, తూంగా నగరం, కరుంగళి (Karungali), కో, మంకథ, ఎంగేయుమ్, ఎప్పోతుమ్, మహారాజా, అరవాన్, కలకలప్పు, వాటికూచి, సెట్టె, సింగం 2, మసాలా, గీతాంజలి, రాణా విక్రమ, శంకరాభరణం, నిశ్శబ్దం, వకీల్ సాబ్, పావ కడైగల్, బైరాగి (Bairagi) వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది.
అయితే నిన్న(జూన్ 16) ఈ హీరోయిన్ పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. కేక్ అండ్ కుక్క పిల్లతో ఉన్న పిక్‌ను పంచుకుని.. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. అలాగే ఈ ఫొటోలో కుక్కపిల్ల నటి అంజలిని క్యూట్‌గా చూస్తోంది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండటంతో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ అంజలి 39 ఏళ్లలోకి అడుగుపెట్టింది. దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.instagram link






