Anjali: ముద్దులతో ముంచేస్తున్న హీరోయిన్ అంజలి.. క్యూట్ పోస్ట్ వైరల్

by I. Sairam |   (  Updated:2025-08-06 07:18:57  IST  )

టాలీవుడ్ హీరోయిన్ అంజలి(Anjali) అందరికి సుపరిచితమే.

Anjali: ముద్దులతో ముంచేస్తున్న హీరోయిన్ అంజలి.. క్యూట్ పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ అంజలి(Anjali) అందరికి సుపరిచితమే. ‘షాపింగ్ మాల్’(Shopping Mall) సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వెంకటేష్(Venkatesh), మహేష్ బాబు(Mahesh Babu) నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’(Seethamma Vakitlo Sirimalle Chettu) మూవీతో మరింత పాపులారిటీ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్స్ రావడంతో బాలకృష్ణ(Balakrishna), వెంకటేష్, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

కానీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రావట్లేదనే చెప్పాలి. తెలుగు అమ్మాయే అయినప్పటికీ మన టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకోలేకపోతుంది. అయితే గత ఏడాది ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’(Gangs Of Godavari) చిత్రంలో తన నటనతో అలరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమాలో నటించింది. అయితే సంక్రాంతి కానుకగా ఎన్నో ఆశలతో జనవరి 10న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని రేంజ్‌లో ప్లాప్ అయింది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది అంజలి. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా అంజలి తన ఇన్‌స్టాలో కొన్ని స్టోరీ షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ డ్రెస్సులో హెయిర్ లీవ్ చేసుకుని ఓ వైట్ క్యూట్ కుక్క పిల్లను ముద్దు పెడుతుంది. ఇక ఈ పిక్‌కు నికో డైరీస్ అనే క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు ఆ పప్పీ ప్లేస్‌లో మేము ఉంటే బాగుండు అని కామెంట్స్ చేస్తున్నారు. మీరి మీరు ఈ భామ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.


Next Story