Andrea Jeremiah: హీరోయిన్స్‌కు స్ట్రాంగ్ పాత్రలు వస్తే హీరోలకు నచ్చదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2025-11-14 15:46:42  IST  )

ఆండ్రియా జర్మియా లేటెస్ట్ తమిళ డార్క్ కామెడీ థ్రిల్లర్ ‘మాస్క్’.

Andrea Jeremiah: హీరోయిన్స్‌కు స్ట్రాంగ్ పాత్రలు వస్తే హీరోలకు నచ్చదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ఆండ్రియా జర్మియా లేటెస్ట్ తమిళ డార్క్ కామెడీ థ్రిల్లర్ ‘మాస్క్’. కవిన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి వికర్ణన్ అశోక్ దర్శకత్వం వహిస్తుండగా.. ది షో మస్ట్ గో ఆన్, బ్లాక్ మద్రాస్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై నిర్మించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఈనెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్నది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆండ్రియా తను నటించిన ‘వడ చెన్నై’ చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

‘వడచెన్నైలో చంద్రగా నటించిన తర్వాత.. నాకు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మూవీ తర్వాత నాకు ఎలాంటి సినిమా ఆఫర్లు రాలేదు. అయితే చాలా మంది నటులు తమ సినిమాల్లో బలమైన, శక్తివంతమైన మహిళా పాత్రలు ఉండటాన్ని అసౌకర్యంగా ఫీల్ అవుతారు. అందుకే ఆ సినిమా తర్వాత నాకు వేరే ఆఫర్లు రాలేదు. ఇది నేను తమిళ సినిమాలో స్పష్టంగా గమనించిన విషయం’ అంటూ విచారం వ్యక్తం చేసింది.

Next Story