- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Ananya Panday: బాడీ షేమింగ్‌పై నోరు విప్పిన అనన్య పాండే.. నా శరీరంతో నేను నిజంగా సంతోషంగా లేనంటూ షాకింగ్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే లైగర్ సినిమాతో టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ సరసన నటించి.. ఈ బ్యూటీ మంచి మార్కులే కొట్టేసింది. కానీ ఈ మూవీ ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది.
తర్వాత ఈ బ్యూటీ రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, పతి పత్నీ ఔర్ వో, ఖాలీ పీలీ, గెహ్రైయాన్, డ్రీమ్ గర్ల్ 2, ఖో గయే హమ్ కహాన్, బాడ్ న్యూజ్, ఖేల్ ఖేల్ మే, సీటీఆర్‌ఎల్ వంటి తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి జనాల మెప్పు పొందింది. ఇకపోతే తాజాగా అనన్య పాండే ఎదుర్కొన్న బాడీ షేమింగ్ గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
3 నుంచి 10 సంవత్సరాల వరకు నేను పుట్టినరోజు పార్టీలలో నృత్యం చేయడానికి ఇష్టపడేదాన్ని అని వెల్లడించారు. కానీ నా టీనేజ్‌లో నా లుక్స్ గురించి పలువురు మాట్లాడటం వినడం ప్రారంభించానని తెలిపింది. ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పుడు కూడా ఈ అవమానాలు అదృశ్యం కాలేదని వెల్లడించింది. నా మొదటి చిత్రంలో నేను నిజంగా నా శరీరంతో ఇబ్బంది పడ్డానని తెలిపింది. ఆ మూవీకి తగ్గట్లు నా బాడీ లేదని తెలిసిందని చెప్పింది. నా శరీరంతో నేను నిజంగా సంతోషంగా లేనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.