Amritha Aiyer: సైలెంట్ అయిపోయిన ‘హనుమాన్’ హీరోయిన్..

by Chukka Sudharani |

మలయాళ బ్యూటీ అమృత అయ్యర్ (Amritha Aiyer) ‘పద్మహ్యూహం’ చిత్రంతో 2012లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

Amritha Aiyer: సైలెంట్ అయిపోయిన ‘హనుమాన్’ హీరోయిన్..
X

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ అమృత అయ్యర్ (Amritha Aiyer) ‘పద్మహ్యూహం’ చిత్రంతో 2012లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. తన నటనతో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు ‘పదైవీరన్’ అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా తన జర్నీని స్టార్ట్ చేసింది. ఇక రామ్ పోతినేని ‘రెడ్’ సినిమాతో తెలుగు ప్రేక్షులను పలకరించిన అమృత.. ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత పలు ఆఫర్లు అందుకుంటూ ఇండస్ట్రీలో హీరోయిన్ రాణిస్తున్న ఈ బ్యూటీ.. 2024లో వచ్చిన ‘హనుమాన్’ (Hanuman)చిత్రంతో ఒక్కసారిగా తన క్రేజ్ మరింత పెంచుకుంది. దీంతో తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుందని అంతా భావించారు. కానీ అనుకున్నట్లు ఏం జరగలేదు.. గతేడాది ‘బచ్చలమల్లి’ (Bachchalamalli)సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మరో మూవీ అనౌన్స్ చెయ్యలేదు. అంతే కాకుండా.. ఈ మధ్య కాలంలో అమృత అయ్యర్ సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్‌గా ఉండక పోవడంతో.. ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి సినిమాతో మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story