‘కొన్ని ప్రయాణాలు చిన్నవిగా ఉండవచ్చు కానీ అత్యంత చిరస్మరణీయంగా మారతాయి’: ఐశ్వర్య రాజేష్

by Kodari Anjali |

తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

‘కొన్ని ప్రయాణాలు చిన్నవిగా ఉండవచ్చు కానీ అత్యంత చిరస్మరణీయంగా మారతాయి’: ఐశ్వర్య రాజేష్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ తెలుగు చిత్రాలతో పాటు తమిళ, మలయాళం సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. ఐశ్వర్య అద్భుతమైన నటనకు నాలుగు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, ఒక ఫిలింఫేర్ సౌత్ అవార్డు, ఒక తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. వరల్డ్ స్పోర్ట్స్ డ్రామా కౌస్య కృష్ణమూర్తి, ఫేమస్ లవర్, రిపబ్లిక్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ ఏడాది సంక్రాంతి పండగకు సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ మూవీలో ఐశ్వర్య అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసు దోచేసిందనడంలో అతిశయోక్తిలేదు. టాలీవుడ్ సీనియర్ నటుడు వెంకటేష్ అండ్ మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తోన్న పలు ఫొటోలు పంచుకుని.. ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ‘‘కొన్ని ప్రయాణాలు చిన్నవిగా ఉండవచ్చు కానీ అత్యంత చిరస్మరణీయంగా మారతాయి’’ అంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story