Aishwarya Rajesh: నెక్ట్స్ సినిమాలో ఆరుగురు పిల్లలకు తల్లిగా చేస్తున్నా.. యంగ్ హీరోయిన్ కామెంట్స్‌కు షాక్‌లో ఫ్యాన్స్

by Chukka Sudharani |

యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh).. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాతో ప్రేక్షకుల మందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

Aishwarya Rajesh: నెక్ట్స్ సినిమాలో ఆరుగురు పిల్లలకు తల్లిగా చేస్తున్నా.. యంగ్ హీరోయిన్ కామెంట్స్‌కు షాక్‌లో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh).. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాతో ప్రేక్షకుల మందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్‌లో వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఐశ్వర్య నలుగురు పిల్లల తల్లిగా నటించి.. తన పర్ఫామెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే.. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌కు హాజరైన ఐశ్వర్య రాజేష్‌కు ‘సాధారణంగా పిల్లల తల్లి అనగా ఏజ్ ఎక్కువ ఉన్నా హీరోయిన్స్ మాత్రమే చేస్తారు.. యంగ్ ఏజ్‌లో పిల్లల తల్లిగా ఎలా నటించారు’ అని ప్రశ్నించగా..

‘ఏజ్ మేటర్ కాదండి.. మీరు ఒక మంచి యాక్టర్ అయితే మనకు వచ్చిన ఏ పాత్రను అయినా చేయగలగాలి. పిల్లల తల్లిగా చేయడంలో తప్పే లేదు. నేను అయితే చాలా సినిమాలు పిల్లల తల్లిగానే చేశాను. అండ్ నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం.. నిజానికి పిల్లలకు తల్లిగా ఉండటం ఓ వరం. నా సంక్రాంతి సినిమాలో నలుగురు పిల్లలు నాకు.. సంక్రాంతి పార్ట్-2 వస్తే నీకు ఆరుగురు పిల్లల్ని ఇస్తాను అని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పారు’ అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాజేష్.

Next Story