- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ప్రపంచం నీతో చెలగాటమాడుతున్నప్పుడు స్వచ్ఛంగా ఉండు’.. నటి పోస్ట్ వైరల్
హీరోయిన్ అదితి రావు హైదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ అదితి రావు హైదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ బాలీవుడ్, తమిళ, తెలుగు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. అదితి రావు హైదరి తెలుగు సినిమా పరిశ్రమకు 2018లో సమ్మోహనం సినిమాతో పరిచయమైంది. అదితి రావు హైదరి.. నటుడు సిద్ధార్థ్‌ని 2024 సెప్టెంబర్ 16 న వివాహం చేసుకుంది. అదితి రావు హైదరి (Aditi Rao Hydari) నటుడు సిద్ధార్థ్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి వనపర్తిలోని రంగనాథస్వామి ఆలయంలో జరిగింది.
అదితి రావు హైదరి ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది. అలాగే ఆమె తన భర్త సిద్ధార్థ్‌తో కలిసి ఒక వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.లేటెస్ట్ లుక్ పంచుకుని.. ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది ‘‘నీటి మార్గం ప్రవహించు, ఆడుకో,,అనుకూలంగా ఉండు, మలచు, నీ మార్గాన్ని సొంతం చేసుకో, శుద్ధి చేసుకుంటూ ఉండు, ప్రపంచం నీతో చెలగాటమాడుతున్నప్పుడు స్వచ్ఛంగా ఉండు, దారిలో మెరుస్తూ ఉండు .. శాశ్వతంగా విలువైనదిగా ఉండు’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.






