- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడో పెళ్లిపై సంచలన ప్రకటన చేసిన హీరోయిన్.. ఫైనల్లీ కరెక్ట్ వ్యక్తి దొరికాడంటూ పోస్ట్
బాలీవుడ్ హీరోయిన్ రాఖీ సావంత్(Rakhi Sawant) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్ట్ హీరోయిన్ అంత పాపులారిటీ తెచ్చుకుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ రాఖీ సావంత్(Rakhi Sawant) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్ట్ హీరోయిన్ అంత పాపులారిటీ తెచ్చుకుంది. ఆమె తెలుగులో కూడా ఓ సినిమాలో ఐటమ్ సాంగ్‌లో ఆడిపాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇక రాఖీ సావంత్ సినిమాల కంటే ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ తెచ్చుకుందనడంలో అతిశయోక్తి లేదు. తన మాటలు, చేష్టలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఆమెకు సంబంధించిన ఏ వీడియో అయినా నిమిషాల్లో నెట్టింట సంచలనం సృష్టిస్తుంది.
ఇక రాఖీ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు మొదట ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కర్ణాటకకు చెందిన కార్త వ్యాపారి అదిల్ ఖాన్ దురానీ(Adil Khan Durrani)ని రహస్యంగా రెండోసారి పెళ్లి చేసుకుంది. కానీ వీరి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. కొన్ని రోజులకే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు.
ఇదిలా ఉంటే.. తాజాగా, రాఖీ సావంత్ మూడో పెళ్లిపై సంచలన ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్‌కు చెందిన నటుడు, నిర్మాత డోడి ఖాన్(Dodi Khan)ను వివాహం చేసుకోబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ‘‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏది ఏమైనా.. చివరకు నా జీవితంలో సరైన వ్యక్తి దొరికాడు’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా డోడి వీడియోను షేర్ చేసింది. అయితే వీరిద్దరి పెళ్లి పాకిస్థాన్‌లో ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
రిసెప్షన్ మాత్రం ఇండియాలో ఉంటుందట. ఇక హనీమూన్ కోసం ఆమె మూడో భర్తతో స్విట్జర్లాండ్(Switzerland) లేదా నెదర్లాండ్‌కు వెల్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాఖీ సావంత్ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కోసం చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం కంగ్రాట్స్ చెబుతున్నారు.






