Heroine Abhinaya: సడేన్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న హీరోయిన్.. ఇన్‌స్టా పోస్ట్‌తో షాక్

by Chukka Sudharani |   (  Updated:2025-03-09 15:40:44  IST  )

‘నేనింతే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి అభినయ (Abhinaya).

Heroine Abhinaya: సడేన్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న హీరోయిన్.. ఇన్‌స్టా పోస్ట్‌తో షాక్
X

దిశ, సినిమా: ‘నేనింతే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి అభినయ (Abhinaya). ఆ తర్వాత పలు మూవీస్‌లో నటించిన ఈమె.. ‘శంభో శివ శంభో’ (Shambho Shiva Shambho), ‘ఢమరుకం’ (Damarukam), ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Valkitlo Sirimalle Chettu) వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీ తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి వివాహ బంధంలోకి అడుగుపెట్టేందు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ఎంగేజ్‌మెంట్ (Engagement) చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. ‘నేటి నుంచి మా ప్రయాణం స్టార్ట్’ అంటూ గుడిలో గంట కొడుతున్న ఫొటోను షేర్ చేసింది. అందులో అభినయ అండ్ పెళ్లి కొడుకు చేతులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక అభినయకు కాబోయే భర్తకు సంబంధించిన ఎటువంటి డిటైల్స్ షేర్ చేసుకోలేదు. ప్రజెంట్ ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ కావడంతో.. కొంత మంది షాక్ అవుతుంటే.. మరికొందరు మాత్రం కాంగ్రాట్స్ అంటూ విష్ చేస్తున్నారు.

READ MORE ...

Anjali: ‘ఇది అన్నింటికంటే గొప్పగా అనిపించింది’.. లవ్ యు ఆల్ అంటూ నటి ఆసక్తికర పోస్ట్



Next Story