- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vishal: సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లకండి.. సంచలనంగా మారి హీరో కామెంట్స్
విశాల్ లేటెస్ట్ తమిళ బ్లాక్ బస్టర్ ‘మదగజరాజా’ (Madagajaraja) చిత్రం జనవరి 31న తెలుగులో రిలీజ్ కాబోతుంది.

దిశ, సినిమా: విశాల్ లేటెస్ట్ తమిళ బ్లాక్ బస్టర్ ‘మదగజరాజా’ (Madagajaraja) చిత్రం జనవరి 31న తెలుగులో రిలీజ్ కాబోతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar), అంజలి (Anjali) హీరోయిన్స్‌గా నటించిన ఈ మూవీని సుందర్ సి (Sundar C) దర్శకత్వం వహించాడు. జెమిని ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, పండుగ సీజన్‌లో తమిళం (Tamil)లో నంబర్ వన్ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్ ఇప్పుడు తెలుగు (Telugu)లో రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా జనవరి 31న ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న హీరో తాజాగా సినీ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
‘సినీ ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి నేను గతంలో ఒకసారి చెప్పాను. అక్కడ పరిస్థితులు బాగోలేదని చెబితే అందరూ నన్ను విలన్‌ను చేశారు. కానీ అదే నిజం. ఒక చిన్న సినిమా రూపొందించాలి అన్నా దానికి కనీసం రూ. 4 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అవి తిరిగి వస్తాయో రావో కూడా తెలియదు. అందుకే దయచేసి ఆ డబ్బుని మీ పిల్లల పేరుపై పిక్స్‌డ్ డిపాజిట్ చేయండి. లేదా భూములు కొనండి. అంతేకాని సినిమాలో రంగంలో పెట్టి నష్టపోకండి. డబ్బులు ఉన్నవారు ఎవరైనా సినిమాల చేయ్యొచ్చు. విజయ్ మాల్యా, అంబానీ లాంటి వాళ్లు కావాలంటే సినిమాలు తీయోచ్చు. కానీ వాళ్లు ఎందుకు తీయడం లేదు.. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో సరైన లాభాలు ఉండవు’ అంటూ చెప్పుకొచ్చారు.






