ప్రియమైన మిత్రులారా.. నన్ను క్షమించండి.. స్టార్ హీరో పోస్ట్ వైరల్

by Chukka Sudharani |   (  Updated:2025-08-12 14:41:11  IST  )

విజయ్ ఆంటోని(Vijay Antony) నటిస్తు్న్న తాజా చిత్రం ‘భద్రకాళి’(Bhadrakali). తన కెరీర్‌లో 25వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు అరుణ్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రియమైన మిత్రులారా.. నన్ను క్షమించండి.. స్టార్ హీరో పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: విజయ్ ఆంటోని(Vijay Antony) నటిస్తు్న్న తాజా చిత్రం ‘భద్రకాళి’(Bhadrakali). తన కెరీర్‌లో 25వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు అరుణ్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో ‘శక్తి తరుమగన్’(Shakti Tharumagan)గా రూపొందుతోన్న ఈ మూవీ తెలుగులో ‘భద్రకాళి’ అనే టైటిల్‌తో రిలీజ్ కాబోతుంది. తెలుగులో ఏసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతున్నట్లు ఇప్పటికే మూవీ టీమ్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతున్నట్లు ప్రకటిస్తూ విజయ్ ఆంటోని తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు.

‘ప్రియమైన మిత్రులారా.. మా సినిమాను వాయిదా వేస్తున్నందుకు క్షమించండి.. తిరిగి సెప్టెంబర్ 19న థియేటర్లలో కలుద్దాం’ అంటూ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించాడు. కాగా.. ఈ సినిమాలో వాగై చంద్రశేఖరం, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, మాస్టర్ కేశవ్, తృప్తి రవీంద్ర, కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతుండగా.. రూ. 190 కోట్ల కుంభకోణం చుట్టూ తిరికే కథగా తెరకెక్కుతోందని తెలుస్తుంది.

Next Story