‘మీరు ఎవరు అనే విషయంలో నిజాయితీగా ఉండటం ముఖ్యం’: టాలీవుడ్ సీనియర్ హీరో

by Kodari Anjali |

టాలీవుడ్ సీనియర్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

‘మీరు ఎవరు అనే విషయంలో నిజాయితీగా ఉండటం ముఖ్యం’: టాలీవుడ్ సీనియర్ హీరో
X

‘మీరు ఎవరు అనే విషయంలో నిజాయితీగా ఉండటం ముఖ్యం’: టాలీవుడ్ సీనియర్ హీరో

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. తనదైన నటనతో జనాల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. సినిమా ప్రపంచంలో విజయాలు, అపజయాలు అనేవి సర్వసాధారణం. వెంకటేష్ అన్నింటిని తట్టుకుని ఈ స్థాయికి ఎదిగారు.

వెంకటేష్ కు బాగా పేరు తెచ్చిన సినిమాలు చూసినట్లైతే. చంటి, కలిసుందాం రా, సుందరకాండ(Sundarakanda), బొబ్బిలిరాజా, రాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సూర్యవంశం(Sūryavanśaṁ), లక్ష్మి. వెంకీ హిందీలో కూడా రెండు చిత్రాల్లో నటించారు. అలాగే వెంకటేష్.. కలియుగ పాండవులు, బ్రహ్మపుత్రుడు, కూలీ నం. 1, చినరాయుడు, ఇంట్లో ఇల్లాలు - వంటింట్లో ప్రియురాలు, నువ్వు నాకు నచ్చావ్, దేవీ పుత్రుడు(Devi putruḍu), ఎఫ్ 3 వంటి మూవీల్లో నటించి.. నెటిజన్లను మెప్పించారు.

ఇప్పటివరకు ఈ హీరో ఏకంగా 70 మూవీల్లో నటించి.. ఏడు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే సంక్రాతి కానుకగా సంక్రాంతికి వస్తున్నాం (Sankrantiki vastunnam) చిత్రం థియేటర్లలో విడుదలై.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. వెంకటేష్ కథానాయకుడి, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఏకంగా ఈ మూవీ మూడు వందల కోట్ల రూపాయల వసూల్లు సాధించి రికార్డు కొల్లగొట్టింది.

ఇకపోతే వెంకటేష్ తరచూ సోషల్ మీడియా వేదిక అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి మాటల్ని రాసి అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఈ హీరో.. ‘‘ప్రజలు మిమ్మల్ని ఇష్టపడవచ్చు లేదా ఇష్టపడకపోవచ్చు. కానీ మీరు ఎవరు అనే విషయంలో మీరు నిజాయితీగా ఉండటం ముఖ్యం’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం వెంకీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్ నెట్టింట వైరల్ అవ్వగా.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Next Story