- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vadde Naveen: చాలా గ్యాప్ తర్వాత ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తున్న హీరో.. ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అప్డేట్
చాలా గ్యాప్ తర్వాత రాబోతున్న హీరో వడ్డే నవీన్. ఆగస్టు 9వ తేదీన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రివీల్

దిశ, సినిమా: సీనియర్ హీరో వడ్డే నవీన్ అందరికి గుర్తుండే ఉంటాడు. కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్నో హిట్‌లను తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో.. అప్పటి యూత్‌కు ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. ఎన్ని హిట్‌లు అందుకున్నా ఉపయోగంలేకుండా పోయినట్లు.. ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. అయితే.. ఇందుకు సంబంధించిన అప్డేట్ ఇవ్వగా వడ్డే నవీన్ హీరోగా కాకుండా వడ్డే క్రియేషన్స్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాతగా మారినట్లు వార్తలు వచ్చాయి.
కానీ, తాజాగా అందుతున్న సమాచారం మేరకు.. ఆయన నిర్మాతగా కాకుండా హీరోగా సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే.. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ & ఫస్ట్ లుక్ ఈ ఆగస్టు 9వ తేదీ మధ్యాహ్నం 12:12 గంటలకు విడుదల అవుతున్న అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్ వైరల్ అవుతుండగా.. చాలా గ్యాప్ తర్వాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వచ్చే నవీన్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు నెటిజన్లు. Link






