హీరో ఉదయ్ కిరణ్ డైరీని హ్యాండిల్ చేసిన మెగా ఫ్యామిలీ.. అసలు విలన్ ఆ పెద్ద మనిషే.. అతడుతో సహా బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ చేజారి.. సూసైడ్

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-12 13:36:18  IST  )

ఉదయ్ కిరణ్.. ‘చిత్రం’ సినిమాతో అరంగేట్రం చేసి వరుస విజయాలు అందుకున్నాడు. 90లలో యంగ్ సూపర్ స్టార్‌గా ఎదిగాడు. ఆయన ఏది ముట్టుకున్నా బంగారం మాదిరిగా అయిపోయింది అప్పట్లో సిట్యుయేషన్. దీంతో మెగా ఫ్యామిలీ ఆయనను

హీరో ఉదయ్ కిరణ్ డైరీని హ్యాండిల్ చేసిన మెగా ఫ్యామిలీ..  అసలు విలన్ ఆ పెద్ద మనిషే.. అతడుతో సహా బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ చేజారి.. సూసైడ్
X

దిశ, ఫీచర్స్ : ఉదయ్ కిరణ్.. ‘చిత్రం’ సినిమాతో అరంగేట్రం చేసి వరుస విజయాలు అందుకున్నాడు. 90లలో యంగ్ సూపర్ స్టార్‌గా ఎదిగాడు. ఆయన ఏది ముట్టుకున్నా బంగారం మాదిరిగా అయిపోయింది అప్పట్లో సిట్యుయేషన్. దీంతో మెగా ఫ్యామిలీ ఆయనను ఇంటి అల్లుడిగా చేసుకోవాలని అనుకుంది. మెగా స్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మితను ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. అంతా ఓకే అనుకున్నారు. తామే అన్ని చూసుకుంటామని భరోసా ఇచ్చారు. అల్లుడు కాబోతున్నాడు కాబట్టి ఆయనను తామే హ్యాండిల్ చేద్దామని ఆలోచించారు. అప్పటికే పీక్స్ చూసిన ఆయన సినిమా కెరీర్‌ను కొత్తగా ప్లాన్ చేద్దామని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలోనే ఆయన డైరీని కూడా తీసుకున్న మెగా ఫ్యామిలీ.. ఏ సినిమాలు ఒప్పుకోవాలి? ఏ సినిమాలు ఒప్పుకోకూడదు? అని నిర్ణయించేశారు. ముఖ్యంగా ఆల్రెడీ ఈ పెళ్లి ప్రస్తావనకు ముందే ఉదయ్ కిరణ్ ‘అతడు’ సినిమాను ఒప్పుకున్నాడు. కానీ ఈ డైరీని మెయింటైన్ చేస్తున్న అల్లు అరవింద్ నిర్మాత, దర్శకులతో నో చెప్పాడని తెలుస్తోంది. ఆ తర్వాత ఈ మూవీ మహేష్ బాబుకు వెళ్లడంతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇలా ఎన్నో గొప్ప సినిమాలను కోల్పోయిన ఉదయ్ కిరణ్.. చివరకు అనుకోని కారణాల వల్ల మెగా ఫ్యామిలీకి కూడా అల్లుడు కాలేకపోయాడు. ఈ ఎఫెక్ట్‌తో అవకాశాలు తగ్గిపోవడం.. చేతిలో సినిమాలు లేక ఆత్మహత్య తీసుకునే పరిస్థితికి చేరడం అందరం చూశామని సోషల్ మీడియాలో స్టోరీస్ వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో మురళీ మోహన్ కూడా ప్రస్తావించాడు.

Next Story