- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లైన మూడేళ్లకే భార్యకు విడాకులు ఇవ్వబోతున్న హీరో.. ఆయన రియాక్షన్ ఇదే!
ఆది పినిశెట్టి(Adi Pinisetty) కోలీవుడ్ నటుడు అయినప్పటికీ ‘ఒక వి చిత్రం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.

దిశ, సినిమా: ఆది పినిశెట్టి(Adi Pinisetty) కోలీవుడ్ నటుడు అయినప్పటికీ ‘ఒక వి చిత్రం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘వైశాలి’ (Vaishali)మూవీతో హిట్ సాధించి ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నారు. ఇక తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోగా, విలన్‌గా నటిస్తూ తన క్రేజ్‌ను పెంచుకుంటున్నారు. ఆది పినిశెట్టి ‘సరైనోడు’ సినిమాలో విలన్‌గా చేసి తన నటనతో మెప్పించాడు. చివరగా ‘పార్ట్‌నర్’తో ప్రేక్షకులను అలరించారు. ఇక ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇక ఆది పినిశెట్టి పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. హీరోయిన్ నిక్కీ గల్రానీని ప్రేమించి 2022లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి పెళ్లై మూడేళ్లు అవుతుంది. కానీ మొదటి బిడ్డకు మాత్రం ఆహ్వానం పలకలేదు. దీంతో విడాకుల వార్తలు వస్తున్నాయి. కాగా, ప్రస్తుతం ‘శబ్దం’ చిత్రంలో నటిస్తున్నారు. అరివళగన్(Arivalagan) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను 7G ఫిల్మ్స్ బ్యానర్‌పై శివ నిర్మిస్తున్నారు.
ఇందులో సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్(Lakshmi Menon) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘శబ్దం’ ఫిబ్రవరి 28న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆది పినిశెట్టి గతంలో వచ్చిన తన విడాకుల వార్తలపై స్పందించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘నిజం చెప్పాలంటే సున్నితంగా ఉండకూడదని అనుకున్నాను. ధైర్యంగా ఉండాలని డిసైడ్ అయ్యాను. కానీ రిజెక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. అందరూ మర్యాద ఇవ్వాలని లేదు. కొంతమంది కేర్ చేయకపోయినా.. నీ వెనుక మాట్లాడుతున్నా ధైర్యంగా ఉండాలి.
అయితే గతంలో నేను విడాకులు థంబ్ నెయిల్ చూసి షాక్ అయ్యాను. ఆ వీడియో పెట్టినవాళ్లు ఎలాంటి వారో చూడాలని అనుకున్నాను. అవన్నీ చూశాక నేను అతని గురించి, మా విడాకులు వార్తలు క్రియేట్ చేసిన విషయం గురించి పట్టించుకోవాలని అనుకోలేదు. ఏమీ లేకుండా రెండు ఫొటోలు పెట్టి చెప్తేస్తే నిజం అయిపోదు కదా. ఇలాంటి వాళ్ల గురించి సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లు వాళ్ల జీవితాన్ని అలా బదికేస్తున్నారని వదిలేయడం మంచిది. ఇలాంటి విషయాలను ఎంత వదిలేస్తే అంత మంచిది. నా విడాకుల వార్తలు చూసినప్పుడు కొద్దిగా బాధపడ్డాను.. కానీ కొన్ని నిమిషాల తర్వాత అవసరం లేదని వదిలేశాను’’ అని చెప్పుకొచ్చారు.






