- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనవసరంగా ఆవేశ పడొద్దు.. ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్ చేసిన హీరో శివ కార్తికేయన్
హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) త్వరలో ‘మదరాసి’ (Madharasi) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

దిశ, సినిమా: హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) త్వరలో ‘మదరాసి’ (Madharasi) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సెప్టెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం వహించగా.. ఇందులో రుక్మిణి వసంత్ (Rukmini Vasant) హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ (Trailer) రిలీజ్ కాగా.. సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ (Super response) వచ్చింది. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో తనకు వచ్చిన ‘నెక్ట్స్ దళపతి, కుట్టి దళపతి’ అనే ట్యాగ్స్‌పై స్పిందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
‘ఇలా నన్ను పిలుస్తున్న మీ అభిమానికి, ప్రేమకు ధన్యవాదాలు. కానీ అన్న (విజయ్ దళపతి) ఎప్పుడూ అన్నే. తమ్ముడు ఎప్పుడూ తమ్ముడే’ అని తెలిపారు. అలాగే తనపై వచ్చే ట్రోల్స్(Trolls)పై మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు అవుతుంది. ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాను అది చాలు. ఇక సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ అంటారా.. అవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అలాంటి వాటిని పట్టించుకుని అనవసరంగా మీరు ఆవేశ పడొద్దు’ అంటూ ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్ చేశాడు శివ కార్తికేయన్.






