'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలో ట్విస్ట్ లీక్ చేసిన శివాజీ

by velandi.Saikiran |

దాదాపు 20 నిమిషాల పాటు విక్టరీ వెంకటేష్ పాత్ర నిడివి ఉంటుందట. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్

మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో ట్విస్ట్ లీక్ చేసిన శివాజీ
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తుండగా నయనతార హీరోయిన్ గా మెరువనున్నారు. విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ లో కనిపిస్తున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు విక్టరీ వెంకటేష్ పాత్ర నిడివి ఉంటుందట. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి ఓ పాటలో చిందులు కూడా వేయనున్నారట.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్విస్ట్‌ రివీల్ చేశారు నటుడు శివాజీ. నటుడు శివాజీ ప్రత్యేక పాత్రలో నటించిన మూవీ దండోరా. ఈ మూవీ ఎల్లుండి రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు అనిల్ రావిపూడి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి గురించి చెప్పే ప్రయత్నంలో భాగంగా 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలో ఉన్న ట్విస్ట్ లీక్ రివీల్ చేశారు శివాజీ. ఈ సినిమాలో వెంకటేష్ ఎంట్రీ కాగానే హైప్ అమాంతం పెరుగుతుందట. చిరంజీవి, వెంకటేష్ కనిపించే సీన్లు బాగా పండుతాయి అని శివాజీ వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Next Story