నన్ను రోహిత్ శర్మ అంటున్నారు..టాలీవుడ్ హీరో కామెంట్స్ వైర‌ల్‌

by velandi.Saikiran |

నన్ను రోహిత్ శర్మ అంటున్నారు..టాలీవుడ్ హీరో శ‌ర్వానంద్ చేసిన‌ కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

నన్ను రోహిత్ శర్మ అంటున్నారు..టాలీవుడ్ హీరో కామెంట్స్ వైర‌ల్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత జట్టు మాజీ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మపై ( Rohit Sharma) టాలీవుడ్ అగ్ర హీరో శర్వానంద్ (Sharwanand) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను చూసి అందరూ రోహిత్ శర్మ అంటున్నారని శర్వానంద్ స్పష్టం చేశారు. టాలీవుడ్ అగ్ర హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ బైకర్. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ బైకర్ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తుండగా, మాళవిక నాయర్ హీరోయిన్ గా మెరువనున్నారు. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా సీనియర్ నటుడు రాజశేఖర్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఏప్రిల్ మూడవ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా స్పెషల్ ఈవెంట్ నిర్వహించగా, ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరో శర్వానంద్.

రోహిత్ శర్మ బయోపిక్ లో శర్వానంద్!

రోహిత్ శర్మ బయోపిక్ లో ( Rohit Sharma's biopic) నటించడంపై టాలీవుడ్ అగ్ర హీరో శర్వానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రోహిత్ శర్మ లాగా ఉన్నాడంటూ చాలా మంది ఇప్పటికే చెప్పినట్లు గుర్తు చేశారు. తన వద్దకు ఆ కథ వచ్చినప్పుడు తప్పకుండా ఆలోచిస్తానని కీలక ప్రకటన చేశారు. రోహిత్ శర్మ స్టోరీ ఎంతో స్ఫూర్తి దాయకంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించే అవకాశం ఉందా? అని ట్రైలర్ ఈవెంట్ సందర్భంగా ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు పై విధంగా శర్వానంద్ స్పందించారు. దీంతో శర్వానంద్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

Next Story