- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బేబీబంప్‌తో ఉన్న తన భార్య ఫొటోలు తీశారని పొట్టు పొట్టుగా తిట్టిన హీరో.. ఏకిపారేస్తున్న నెటిజన్లు(వీడియో)
బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ(Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra) 2023లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ(Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra) 2023లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి ఓ పక్క సినిమాలతో మరో పక్క ఫ్యా మిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు ఈ జంట. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటున్నారు. అయితే ఈ జంట త్వరలో తల్లిదండ్రులు కానున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే వారు ఈ శుభవార్తను పంచుకున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. తాజాగా కియారా రొటీన్ చెకప్‌లో భాగంగా బుధవారం (ఏప్రిల్23) ఆస్పత్రికి వెళ్లింది. ఆమె వెంట భర్త సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ఉన్నాడు.
అయితే కియారా అద్వానీ ఆసుపత్రికి చేరుకోగానే ఆమె ఫోటోలు తీసుకోవడానికి ఫొటో గ్రాఫర్లు ఎగబడ్డారు. ఇది సిద్ధార్థ్ మల్హోత్రాకి కోపం తెప్పించింది. దీంతో అతను ఫొటో గ్రాఫర్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ‘మీరందరూ వెనక్కి వెళ్లిపోండి’ అంటూ వారిపై విరుచుకు పడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సాధారణంగా సిద్ధార్థ్ మల్హోత్రా వీలైనంత వరకు కూల్‌గా ఉంటాడు ఇప్పుడు అతను గర్భంతో ఉన్న భార్య సేఫ్టీ గురించి పలు జాగ్రత్తలు తీసుకుంటున్న క్రమంలో ఫొటో గ్రాఫర్స్‌తో అలా బిహేవ్ చేశాడని, అతని తప్పేం లేదు ‘సిద్ధార్థ్ చేసింది సరైనదే మంచి భర్తగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడని, ఈ జంటకు ప్రైవసీ ఇవ్వాలని, ఫొటో గ్రాఫర్లు సరిగ్గా ప్రవర్తించడం నేర్చుకోవాలి అంటూ ఫొటోగ్రాఫర్స్‌ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.






