నిర్మాతగా మారిన మరో యంగ్ హీరో.. క్రేజీ న్యూస్‌తో ఆనందంలో ఫ్యాన్స్!

by Chukka Sudharani |

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు.. సినిమాల్లో నటిస్తూనే మరొపక్కా నిర్మాతలుగా మారి నిర్మిస్తున్నారు కూడా.

నిర్మాతగా మారిన మరో యంగ్ హీరో.. క్రేజీ న్యూస్‌తో ఆనందంలో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు.. సినిమాల్లో నటిస్తూనే మరొపక్కా నిర్మాతలుగా మారి నిర్మిస్తున్నారు కూడా. సొంతగా బ్యానర్స్ స్థాపించి కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ సినిమాలను నిర్మించడంతో పాటు.. ఇతర సంస్థలతో కలిసి తమ సినిమాలను తామే నిర్మించుకుంటున్నారు. ఇప్పటికే ఈ లిస్ట్‌‌లో నేచురల్ స్టార్ నాని, మహేశ్ బాబు, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, అల్లు అర్జున్ వంటి చాలా మంది హీరోలు ఉండగా.. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో యంగ్ రామ్ పోతునేని (Ram Pothineni) కూడా జాయిన్ అయినట్లు తెలుస్తోంది.

రామ్ సొంత బాబాయ్ రవి కిషోర్ శ్రావంతి మూవీస్ బ్యానర్‌పై ఎన్నో హిట్ సినిమాలు చేశారు. ఆయన వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ హీరో అయ్యాడు. ఇప్పుడు బాబాయ్ బాటలోనే కొత్త ప్రొడక్షన్ బ్యానర్‌ను రంగంలోకి దించే ప్లానింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. రామ్ సొంత బ్యానర్‌పై ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు కానీ.. ఈ బ్యానర్‌లో రామ్ తన సొంత సినిమాలను నిర్మిస్తాడా..? లేదా కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చి వారి సినిమాలు నిర్మిస్తాడా అనే చర్చలు మాత్రం నెట్టింట షురూ అయ్యాయి.

Next Story