- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లేడీ ఫ్యాన్ కు స్టేజ్ పైనే హగ్ ఇచ్చిన హీరో రామ్.. వీడియో వైరల్
హీరో రామ్ మాట్లాడుతుండగా ఓ లేడీ అభిమాని స్టేజ్ పైకి ఎమోషనల్ అవుతూ పరిగెత్తింది. ఆ సందర్భంగా

దిశ, వెబ్ డెస్క్: తెలుగు స్టార్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులోనే కాకుండా తమిళ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా హీరో రామ్ కు అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా హీరో రామ్ కు మహేష్ బాబు తరహా లోనే లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఇదే విషయాన్ని తాజాగా జరిగిన ఓ సంఘటన స్పష్టం చేసింది. ఆంధ్ర కింగ్ తాలూకా ( Andhra King Taluka) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం బెంగళూరులో ఓ ఈవెంట్ నిర్వహించింది. దీనికి హీరో రామ్ తో పాటు ఉపేంద్ర, హీరోయిన్ భాగ్యశ్రీ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతుండగా ఓ లేడీ అభిమాని స్టేజ్ పైకి ఎమోషనల్ అవుతూ పరిగెత్తింది. ఆ సందర్భంగా ఆమె కింద పడిపోయారు. వెంటనే ఆమెను పైకి లేపి హగ్ చేసుకున్నారు హీరో రామ్. అనంతరం ఆమెను ఓదార్చారు. వాటర్ బాటిల్ ఇచ్చి, కూల్ చేశారు. ఇక తన అభిమాన హీరోరామ్ ను చూసిన నేపథ్యంలో ఆ లేడీ అభిమాని కూడా ఆనందభాష్పాలు రాల్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కాగా హీరో రామ్, భాగ్యశ్రీ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా నవంబర్ 27వ తేదీని రిలీజ్ కానుంది. దీంతో సౌత్ ఇండియా మొత్తం ప్రమోషన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు హీరో రామ్. క్లిక్






