మంగళసూత్రం వేసుకోకపోవడం నా భార్య ఇష్టం.. టాలీవుడ్ హీరో సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

టాలీవుడ్ హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మంగళసూత్రం వేసుకోవడం, వేసుకోకపోవడం నీ ఇష్టం అని పెళ్లి తరవాత తన భార్య చిన్మయికి చెప్పానని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. పురుషుల‌కు పెళ్లి జ‌రిగిన‌ట్టు ఎలాంటి సంకేతాలు లేక‌పోవ‌డం అన్యాయం అని వ్యాఖ్యానించారు.

మంగళసూత్రం వేసుకోకపోవడం నా భార్య ఇష్టం.. టాలీవుడ్ హీరో సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మంగళసూత్రం వేసుకోవడం, వేసుకోకపోవడం నీ ఇష్టం అని పెళ్లి తరవాత తన భార్య చిన్మయికి చెప్పానని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. పురుషుల‌కు పెళ్లి జ‌రిగిన‌ట్టు ఎలాంటి సంకేతాలు లేక‌పోవ‌డం అన్యాయం అని వ్యాఖ్యానించారు. స్త్రీల‌కు వివాహం జ‌రిగిన‌ట్టు ఒక సంకేతం ఉండ‌టం న్యాయం కాదు కాబ‌ట్టి మంగ‌ళ‌సూత్రం ధ‌రించ‌వ‌ద్ద‌ని చెప్పాన‌ని అన్నారు. పురుషుల‌కు, స్త్రీల‌కు ఒకే న్యాయం ఉండాల‌ని చెప్పారు.

రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైర‌ల్ అవ్వ‌డంతో కొంద‌రు విమ‌ర్శిస్తే మరికొంద‌రు ప్ర‌శంసిస్తున్నారు. తాళి ఉంటే మ‌హిళ‌కు సేఫ్లీ ఉంటుంద‌ని కొంద‌రు కామెంట్ చేస్తే.. మ‌రి కొంద‌రు రాహుల్ త‌న పాయింట్ చెప్పాడు. అది వాళ్ల ఇష్టం అంటూ మ‌రికొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాహుల్ ర‌వీంద్ర‌ణ్ అందాల రాక్ష‌సి సినిమాతో టాలీవుడ్ కు హీరోగా ప‌రిచ‌య‌మై ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. ఆ త‌ర‌వాత ప‌లు సినిమాల్లో హీరోగా న‌టించినా స‌రైన హిట్ ప‌డ‌లేదు. కానీ చిలాసౌ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం అటు న‌టుడిగా, ఇటు ద‌ర్శ‌కుడిగా రాణిస్తున్నాడు.

Next Story