బర్త్‌డే స్పెషల్‌గా ‘కపుల్ ఫ్రెండ్లీ’ నుంచి హీరో పోస్టర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న సింపుల్ లుక్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-07-12 06:00:43  IST  )

సంతోష్ శోభన్(Santhosh Sobhan), మానస వారణాసి(Manasa Varanasi) జంటగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ 'కపుల్ ఫ్రెండ్లీ'(Couple Friendly).

బర్త్‌డే స్పెషల్‌గా ‘కపుల్ ఫ్రెండ్లీ’ నుంచి హీరో పోస్టర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న సింపుల్ లుక్
X

దిశ, వెబ్‌డెస్క్: సంతోష్ శోభన్(Santhosh Sobhan), మానస వారణాసి(Manasa Varanasi) జంటగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ 'కపుల్ ఫ్రెండ్లీ'(Couple Friendly). దీనికి ద‌ర్శ‌కుడు అశ్విన్ చంద్ర‌శేఖ‌ర్(Aswin Chandrashekar) డైరెక్ట్ చేస్తుండగా.. యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రానికి అజ‌య్ కుమార్.పి కో ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే చెన్నై బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆదిత్య రవీంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియో గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ మూవీ నుంచి ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మూవీటీమ్.

ఈరోజు సంతోష్ శోభన్ పుట్టిన రోజు సందర్భంగా అతనికి విష్ చేస్తూ.. ‘కపుల్ ఫ్రెండ్లీ బృందం నుండి సంతోష్ శోభన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఈ మూవీ త్వరలో తెలుగు & తమిళంలో రానుంది’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో హీరో హెల్మెట్ పెట్టుకుని ముందు ఓ బ్యాగ్ పెట్టుకుని ఓ సాధారణ ఫ్యామిలీ మ్యాన్‌లా కనిపిస్తూ బైక్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇక అతని పక్కన ఆటో, వెనుక కూడా ఆటో, బైక్స్ ఉన్నాయి. ఫైనల్‌గా సింపుల్ లుక్‌లో ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటుంది. Link

Next Story