నా సినిమాలు రీచ్ అవ్వడానికి టైమ్ పడతాయి.. హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

నవీన్ చంద్ర(Naveen Chandra) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘షో టైమ్’(Show time).

నా సినిమాలు రీచ్ అవ్వడానికి టైమ్ పడతాయి.. హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: నవీన్ చంద్ర(Naveen Chandra) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘షో టైమ్’(Show time). మదన్ దక్షిణామూర్తి (Director Madan Dakshinamurthy) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర్ సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ నెం 1 బ్యానర్‌పై కిషోర్ గరికపాటి నిర్మిస్తున్నారు. ఇందులో కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) హీరోయిన్‌గా నటిస్తుండగా.. భారీ అంచనాల మధ్య ఈ మూవీ జూలై 4న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు మూవీ టీమ్.

ఇందులో భాగంగా.. ‘మీరు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ మంచి సినిమాలు చేస్తున్నారు. రీసెంట్‌గా వచ్చిన లెవన్ మూవీ (Eleven movie) సక్సెస్ అందుకుంది. కానీ, ఓటీటీలో మాత్రమే ఆ స్పీడ్ ఉంటుంది.. థియేటర్స్‌లో ఎందుకు ఉండదు’ అని రిపోర్టర్ నవీన్ చంద్రను ప్రశ్నించగా.. ‘నేను చేసే సినిమాలు.. ఎంచుకునే కథలు వెంటనే మార్నింగ్ షో అవ్వగానే అలా ఓపెనింగ్స్ వచ్చేసి.. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని చెప్పలేము. కాన్సెప్ట్ ఫిలిమ్స్ పికప్ అవ్వడానికి టైమ్ తీసుకుంటాయి. ప్రేక్షకులు ఆ సినిమాను ఇష్టపడితే వేరే వాళ్లకు చెప్తారు. అలా సినిమాకు రీచ్ వస్తుంది. ఈ క్రమంలోనే నోటీ మాట ద్వారా రీచ్ అందుకునే లోపే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అందుకే అక్కడ సక్సెస్ అవుతున్నాయి’ అని తెలిపాడు.

Next Story