పాపం.. హీరోయిన్ పై నాని సీరియస్... గట్టిగా అరుస్తూ వార్నింగ్ !

by velandi.Saikiran |

నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా చేసిన తాజా సినిమా హిట్ 3 ( Hit 3). హిట్ 1, హిట్ 2 రెండు పార్ట్స్ సక్సెస్ కావడంతో.... ఇ

పాపం.. హీరోయిన్ పై నాని సీరియస్... గట్టిగా అరుస్తూ వార్నింగ్ !
X

దిశ, వెబ్ డెస్క్ : నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా చేసిన తాజా సినిమా హిట్ 3 ( Hit 3). హిట్ 1, హిట్ 2 రెండు పార్ట్స్ సక్సెస్ కావడంతో.... ఇప్పుడు హిట్ 3 వస్తోంది. ఈ సినిమాలో శ్రీ నిధి ( srinidhi shetty) అలాగే హీరో నాని జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా శైలేష్ కొలను ( Sailesh Kolanu) దర్శకత్వంలో వస్తోంది. మొదటి రెండు పార్ట్స్ సక్సెస్ కావడంతో... హిట్ 3 సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. చాలా థియేటర్స్ హౌస్ఫుల్ కూడా అవుతున్నాయి. నాని సినిమా కావడంతో కచ్చితంగా 100 కోట్లు కొల్లగొట్టడం గ్యారంటీ అంటున్నారు. ఈ సినిమా మార్చి మొదటి వారంలో రిలీజ్ కానున్న నేపథ్యంలో.. చిత్ర బృందం ఇప్పటికే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించింది. హీరో నాని అలాగే శ్రీనిధి ఇద్దరు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకొని... సినిమా ప్రమోషన్ లో కూడా పాల్గొన్నారు. అయితే తాజాగా ఓ ప్రముఖ మీడియా ఛానల్ కు హీరో నాని అలాగే హీరోయిన్ శ్రీనిధి ఇద్దరు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా యాంకర్ అడుగుతున్న ప్రశ్నలకు హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఆన్సర్స్ ఇస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఓయ్ అంటూ హీరో నాని గట్టిగా అరిచాడు. అచ్చం అరుంధతి సినిమాలో.. సమాధి నుంచి వచ్చిన అరుపుల లాగే నాని అరిచాడు. దీంతో హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Next Story