‘మీ అందరి ఆశీర్వాదాలు నా కుమారుడికి కావాలి’.. అఖిల్ పెళ్లిపై అక్కినేని నాగార్జున ప్రకటన

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌(Hyderabad)లోని నివాసంలో నటుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కుమారుడు అక్కినేని అఖిల్(Akhil) వివాహం గ్రాండ్‌గా జరిగింది.

‘మీ అందరి ఆశీర్వాదాలు నా కుమారుడికి కావాలి’.. అఖిల్ పెళ్లిపై అక్కినేని నాగార్జున ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లోని నివాసంలో నటుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కుమారుడు అక్కినేని అఖిల్(Akhil) వివాహం గ్రాండ్‌గా జరిగింది. నాగార్జునకు అత్యంత సన్నిహితులైన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కుటుంబం, దర్శకుడు రాజమౌళి కుటుంబం, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, నటుడు శర్వానంద్‌తోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల మధ్య ఈ వేడుక జరిగింది. తాజాగా అఖిల్ పెళ్లిపై నాగార్జున అధికారిక ప్రకటన చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

‘ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తోంది. మాకు అత్యంత ఇష్టమైన వారి మధ్య నా కుమారుడు అఖిల్ వివాహం జరిగింది. వారిద్దరి నూతన ప్రయాణానికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. ప్లీజ్ బ్లెస్’ అని నాగార్జున ట్వీట్ పెట్టారు. కాగా, జూన్‌ 8వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్‌లో రిసెప్షన్‌ జరగనుంది. ఈ రిసెప్షన్‌ విందుకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

Next Story