Madhavan: ఆ విషయంలో అస్సలు కంట్రోల్ చేసుకోలేను.. అందుకే నా భార్య మూర్ఖుడు అని తిడుతుంది.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

తెలుగు, తమిళం, హిందీ అని భాషతో సంబంధం లేకుండా అనేక మంది అభిమానులను సొంతం చేసుకుని స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు హీరో మాధవన్

Madhavan: ఆ విషయంలో అస్సలు కంట్రోల్ చేసుకోలేను.. అందుకే నా భార్య మూర్ఖుడు అని తిడుతుంది.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: తెలుగు, తమిళం, హిందీ అని భాషతో సంబంధం లేకుండా అనేక మంది అభిమానులను సొంతం చేసుకుని స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు హీరో మాధవన్ (Madhavan). ఆయన నటించిన తాజా చిత్రం ‘హిసాబ్ బరాబర్’ (Hisaab Barabar). అశ్వని ధీర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కీర్తి కుల్హరి, నీల్ నితిన్ ముకేశ్, రష్మీ దేశాయ్, ఫైజల్ రషీద్ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. థ్రిల్లర్ యాక్షన్ (Thriller action) డ్రామాగా రూపొందిన ఈ మూవీ జనవరి 24 నుంచి డైరెక్ట్‌గా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ౫ (ZEE5)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవన్ తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.

‘ఆమిర్ ఖాన్ (Aamir Khan) ఎక్కడికైనా వెళ్లినప్పుడు అతడి పర్సు వెంటపెట్టుకుని వెళ్లడు. ఏది కావాలన్నా ఆయన పక్కన ఉన్నవాళ్లు చూసుకుంటారు. తన స్టార్‌డమ్ అలాంటిది. అయితే.. ఏది ఫ్రీగా రాదు అనుకోండి. తన పక్కన ఉన్నవాళ్లకు కూడా ఆయన తర్వాత డబ్బులు చెల్లించాల్సిందే. కానీ అలా నా వల్ల కాదు. నేను ఖర్చులకు వెనకాడను. ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేసేస్తాను. అయితే.. నా బడ్జెట్‌కు మించిన వాటి జోలికి కూడా వెళ్లను. ఖర్చుల విషయంలో కొద్దిగా కంట్రోల్ చేసుకోలేను. నాకు ఎక్కవగా ఒంటరిగా వెళ్లడం ఇష్టం. స్వేచ్ఛగా తిరగడం, జనాలతో కలవడం ఇష్టం ఎంత ఖర్చు పెడుతున్నాననేది చూసుకోను. నచ్చినట్లు బతికేస్తా. ఏది కావాలనిపిస్తే అది కొనేస్తాను. అందుకే నా ఖర్చులు చూసి నా భార్య సరిత తిడుతూ ఉంటుంది. నేనొక మూర్ఖుడిని అనుకుంటుంది.. నాకు డబ్బులు పొదుపుగా వాడటం తెలియదని తిడుతూ ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ మాధవన్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా.. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌తో మాధవన్ ‘3 ఇడియట్స్’ సినిమాలో నటించాడు. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అమిర్ ఖాన్ గురించి చెప్పుకొచ్చాడు.

Next Story