సినిమా క్లైమాక్స్ విని షాకయ్యాను.. హీరో కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్

by Chukka Sudharani |

అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’.

సినిమా క్లైమాక్స్ విని షాకయ్యాను.. హీరో కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నవంబర్ 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది. ఇందులో భాగంగా.. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం అతిథిగా హాజరై సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

‘మేము షార్ట్ ఫిలింస్ చేసేప్పుడు కొత్త వాళ్లకు ఏదైనా సపోర్ట్ దొరికితే బాగుండేది అనిపించేది. ఇప్పుడా సపోర్ట్ ఈటీవీ వారి రూపంలో యంగ్ టాలెంట్‌కు దక్కుతోంది. రాజు వెడ్స్ రాంబాయి మూవీ ట్రైలర్ చూస్తుంటే ప్రతి షాట్ కొత్తగా అనిపించింది. అదే విషయాన్ని సాయిలుకు చెప్పాను. ఊరి కథలు ప్రేక్షకులు చూస్తారా అంటే తప్పకుండా చూస్తారు మనలో 80శాతం మంది ఊరి నుంచి వచ్చినవాళ్లమే. సినిమాలను ఎక్కువగా ఆదరించేది ఊరి వాళ్లే. నేను చాలా దారుణాలు విన్నాను గానీ వీళ్లు వచ్చి సినిమా క్లైమాక్స్ గురించి చెప్పినప్పుడు షాక్ అయ్యాను. ఇలాంటిది జరిగిందా. మా ఊరు చుట్టుపక్కల ప్రేమ కథల్లో కూడా దారుణాలు జరిగాయి గానీ ఇలాంటివి నిజంగా జరిగిందా, ఇలా చేస్తారా, ఇలాంటి మనుషులు ఉంటారా అనిపించింది.

ఈ సినిమాను మిగతా అందరి కంటే ముందు పదిహేనేళ్లు ప్రేమ కథను దాచిపెట్టిన ఆ ఊరి వాళ్లు ఫస్ట్ చూడాలి. ఈ బాధను మనం పక్కని వాళ్లకు కూడా చెప్పుకోలేకపోయాం. ఈ కథను సినిమాగా చేశారు చూద్దామని ఆ ఊరిలోని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. క్లైమాక్స్ తెలుసుకుని నేను షాక్ అయినట్లే సినిమా చూసిన ఆడియెన్స్ కూడా ఫీల్ అవుతారు. మీకు అందుబాటులో ఉండేలా 99 రూపాయలకే టికెట్ రేట్ పెట్టారు. మీరంతా సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు.

Next Story