ఈ టాలీవుడ్ హీరో మాములోడు కాదు.. ఇటీవల నిర్మాతగా, ఇప్పుడు డైరెక్టర్‌గా

by Chukka Sudharani |

డిఫరెంట్ కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకన్న హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు డైరెక్టర్‌గా కూడా తన లవ్ పరిక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నాడు.

ఈ టాలీవుడ్ హీరో మాములోడు కాదు.. ఇటీవల నిర్మాతగా, ఇప్పుడు డైరెక్టర్‌గా
X

దిశ, సినిమా: ‘క’, ‘కే ర్యాంప్’ చిత్రాలతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ప్రస్తుతం ‘బేబీ’ ఫేమ్ సాయి రాజేష్ కథ అందిస్తున్న ‘చెన్నై లవ్‌స్టోరీ’తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఈ యంగ్ హీరో ఇప్పుడు తన కెరీర్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ మేరకు ఇప్పటికే నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ‘‌KA ప్రొడక్షన్స్’ అండ్ ‘సుమైరా స్టూడియోస్’ బ్యానర్‌లపై సొంత నిర్మాణ సంస్థను స్థాపించి.. నిర్మాతగా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా చేస్తున్నాడు. అంతే కాకుండా.. ఇప్పుడు దర్శకుడిగా తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధం అవుతున్నాడు. గతంలో తన ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ సినిమాకు కథ, దర్శకత్వం శాఖలు చూసుకున్న కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు పూర్తిస్థాయిలో తన సొంత కథతో దర్శకత్వం వహించేందుకు సిద్ధమయ్యారు.

ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయిన ఈ ప్రాజెక్ట్‌ను మే నెల నుండి సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రల కోసం సౌత్ స్టార్ యాక్టర్ అరవింద్ స్వామి, కన్నడ వెర్సటైల్ నటుడు రాజ్ బి. శెట్టిలను సంప్రదిస్తున్నట్లు తెలుస్తుండగా.. ఈ కాంబినేషన్ కుదిరితే కిరణ్ దర్శకత్వ అరంగేట్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారుతుంది అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ క్రేజీ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Next Story