నటీనటుల మధ్య ఏజ్ గ్యాప్ పై హీరో కార్తీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Naga Rani Yarlagadda |

ఈ మధ్య సినిమాల్లో నటీనటులను చూస్తే.. ఆ హీరో పక్కన ఆమె హీరోయినా..

నటీనటుల మధ్య ఏజ్ గ్యాప్ పై హీరో కార్తీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య సినిమాల్లో నటీనటులను చూస్తే.. ఆ హీరో పక్కన ఆమె హీరోయినా అని 100 మందిలో కనీసం 20 మందైనా చర్చించుకుంటారు. 50 ఏళ్ల హీరో పక్కన, పాతికేళ్ల వయసున్న హీరోయిన్ నటించడం ఏంటి? నిజజీవితంలో అయితే ఇలానే ఉంటారా అని చెవులు కొరుక్కుంటు ఉంటారు. తాజాగా ఈ విషయంపై హీరో కార్తీ స్పందించారు. అన్నగారు వస్తారు సినిమా ప్రమోషన్లలో పాల్గొన కార్తీ.. ఏజ్ గ్యాప్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నటీనటుల మధ్య వయసు తేడాపై ఆందోళన చెందిత.. మనం సినిమాలు తీయడం మానేయాలన్నారు. ప్రేక్షకులు వయసు తేడా గురించి పట్టించుకోకుండా ఆ క్యారెక్టర్లను మాత్రమే చూడాలని కోరారు. కార్తీ చెప్పిన విషయాన్ని కొందరు యాక్సెప్ట్ చేసినా మరికొందరు మాత్రం.. తెరపై కనిపించే జంట మధ్య వయసు తేడా ఎక్కువగా ఉంటే.. చూడటానికి వింతగా ఉంటుందని వాదిస్తున్నారు. ఈ చర్చ విభిన్న అభిప్రాయాలకు దారితీస్తూనే ఉంది.

అన్నగారు వస్తారు సినిమా నలన్ కుమార్ స్వామి దర్శకత్వంలో, స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్ గా, కార్తీ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 12న విడుదల కాబోతోంది.

Next Story