- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jayam Ravi: పండగపూట కీలక ప్రకటన విడుదల చేసిన హీరో.. నా జర్నీలో కొత్త అధ్యాయం అంటూ పోస్ట్
తమిళ స్టార్ హీరో జయం రవి(Jayam Ravi) గత కొద్ది రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్నారు.

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో జయం రవి(Jayam Ravi) గత కొద్ది రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆయన తన భార్య ఆర్తి(Aarti)తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. ఈ క్రమంలోనే.. తన భార్య మాత్రం తనకు తెలియకుండా ఎలా డైవర్స్ ఇస్తారని పోస్ట్ పెట్టడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. అయితే వీరిద్దరి విడాకులు కోర్టు వరకు వెళ్లగా ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి కలిసిపోవాలని సూచించింది. ఇక జయం రవి మాత్రం వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే..తాజాగా, జయం రవి పండగపూట కీలక ప్రకటన విడుదల చేశారు.
తన పేరును మార్చుకోవడంతో పాటుగా.. ఓ స్టూడియో స్థాపించి నిర్మాతగా అవతారం ఎత్తారు. ఈ మేరకు సోషల్ మీడియా(Social Media)లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఈ కొత్త సంవత్సరంలో నా జీవితంలో కొత్త విషయాలు మొదలు పెట్టబోతున్నాను. అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. సినిమా అనేది నా ఫ్యాషన్. అదే నన్ను ఇక్కడ నిలబెట్టింది. మీ అందరి సపోర్ట్ ఇచ్చింది. ఇకపై అందరూ నన్ను రవి లేదా రవి మోహన్(Ravi Mohan) అనే పిలవండి. ఇకపై నన్ను జయం రవి అని పిలవకండి. ఇది నా రిక్వెస్ట్.
రవి మోహన్ స్టూడియోస్(Ravi Mohan Studios) స్థాపించి సరికొత్త కథలను సినిమాల రూపంలోకి మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే నా ఫ్యాన్స్ కి నేనిచ్చే మెసేజ్ ఏంటంటే.. నాకున్న అన్ని ఫ్యాన్స్ క్లబ్స్ ని కలుపుతూ ‘రవి మోహన్ ఫ్యాన్స్ ఫౌండేషన్’(Ravi Mohan Fans Foundation) అనే సంస్థగా మారుస్తున్నాను. దీని ద్వారా సేవా సహాయ కార్యక్రమాలు, సొసైటీలో మంచిని పెంపొందించడం చేస్తాను. నా ఈ కొత్త జర్నీలో మీ అందరూ నాకు సహకరించండి’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన వారు కొందరు షాక్ అవుతున్నారు.






