- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా భార్య కోట్లు దోచేసింది..కెనీషా నా జీవితంలోకి వెలుగులా వచ్చింది..స్టార్ హీరో సంచలన లేఖ
తమిళ స్టార్ హీరో జయం రవి తన మాజీ భార్య ఆర్తి రవిపై సంచలన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో సుధీర్ఘ లేఖను విడుదల చేశారు. లేఖలో జయం రవి..తన భార్య నిలువెల్లా దోచేసిందని ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో జయం రవి తన మాజీ భార్య ఆర్తి రవిపై సంచలన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో సుధీర్ఘ లేఖను విడుదల చేశారు. లేఖలో జయం రవి..తన భార్య నిలువెల్లా దోచేసిందని ఆరోపించారు. ఆమె కుటుంబ సభ్యులు కోట్లాది రూపాయలు అప్పు చేసి తనను నడిరోడ్డుకు లాగేశారని ఆరోపించారు. తన ఆడంబరాల కోసం ఆర్తి ఆమె కుంటుంబ సభ్యులు తననుదోచుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం కన్న బిడ్డలను కడూా చూడనివ్వడం లేదని మండిపడ్డారు.
తన పిల్లల కోసం డబ్బులు ఇస్తున్నానని కానీ వాళ్లను చూడనివ్వకుండా బౌన్సర్లను నియమించారని చెప్పారు. తన గురించి పిల్లలకు తెలుసు అని వాళ్లను సింపతీ కోసం వాడుకోవడం లేదన్నారు. మానసికంగా, శారీరకంగా అలిసిపోయానని ఈ సమయంలో జీవితంలో వెలుగులా కేనీషా వచ్చిందని చెప్పారు. ఎన్నో బాధలు భరించానని, ఇక ఓపిక లేదని ఎమోషనల్ అయ్యారు. పదేళ్ల సంపాదన తల్లి దండ్రులకు పంపకుండా వీళ్లకే ఇచ్చానని అయినా నిందిస్తున్నారని చెప్పారు.
తాను ఇంటినుండి కట్టుబట్టలతో వచ్చినప్పుడు కెనీషా సపోర్ట్ చేసిందన్నారు. తనను దగ్గరుండి చూసుకుందని సంతోషంగా ఉంచాలని చూసిందన్నారు. తనకు తన పేరెంట్స్ కు ఎంతో సాయం చేసిందన్నారు. ఆమె క్యారెక్టర్‌ను ఎవరైనా అగౌరవపరిస్తే ఒప్పుకోనని చెప్పారు. తనను ఎలా గౌరవిస్తారో కెనీషాను కూడా అలాగే గౌరవించాలని కోరాడు. ఇక్కడితో దీనిని వదిలేస్తున్నానని కేసు కోర్టు పరిధిలో ఉందని ఏం ఉన్నా కోర్టులోనే చూసుకుందామని మాజీ భార్యకు జయం రవి స్పష్టం చేశాడు.






