- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Guard-Revenge for Love: గార్డ్-రివెంజ్ ఫర్ లవ్.. అందరినీ మెప్పింస్తుంది అంటున్న యంగ్ హీరో
అను ప్రొడక్షన్స్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘గార్డ్’ (Guard). ఈ చిత్రంతో విరాజ్ రెడ్డి చీలం (Viraj Reddy Cheelam) హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు.

దిశ, సినిమా: అను ప్రొడక్షన్స్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘గార్డ్’ (Guard). ఈ చిత్రంతో విరాజ్ రెడ్డి చీలం (Viraj Reddy Cheelam) హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. ‘రివెంజ్ ఫర్ లవ్’ (Revenge for Love) అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి జగ పెద్ది దర్శకత్వం వహించగా.. అనసూయ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ ఫిబ్రవరి 28న విడుదల కాబోతోంది. ఇందులో భాగంగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో విరాజ్ రెడ్డి చీలం మీడియాతో ముచ్చటించారు. ‘మాది నిజామాబాద్ (Nizamabad). ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా (Australia)కు వెళ్లి సెటిల్ అయ్యాను. చిన్నప్పటి నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. అక్కడే యాక్టింగ్ స్కూల్‌కు వెళ్లాను. ఈ మూవీ మొత్తాన్ని కూడా ఆస్ట్రేలియాలోనే షూట్ చేశాం. నేను అక్కడే ఉండే వాడ్ని కాబట్టి అక్కడ షూట్ చేశాం. కానీ స్టోరీ మాత్రం మనదే. తెలుగు వాళ్ల వైబ్ ఎలా ఉంటుందో సినిమా కూడా అలానే ఉంటుంది. కాకపోతే ఆస్ట్రేలియా ఫ్లేవర్ ఉంటుంది. అక్కడి ఓ సెక్యురిటీ గార్డ్ లైఫ్ (Security guard life) ఎలా ఉంటుందో చూపించాను. ఇక్కడ సెక్యురిటీ గార్డ్ లైఫ్ వేరేలా ఉంటుంది. కానీ ఆస్ట్రేలియాలో సెక్యురిటీ గార్డ్ అన్నా కూడా బీఎండబ్ల్యూ (BMW) కూడా ఉంటుంది. హారర్, యాక్షన్, కామెడీ, రివేంజ్ ఇలా అన్ని అంశాలతో తీసిన ఈ మూవీ పూర్తిగా హీరోయిజం చూపించే పాత్ర కాదు. కథకు తగ్గట్టుగా అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించాల్సి ఉంటుంది. టీజర్, ట్రైలర్ చూసిన వారంతా మెచ్చుకున్నారు. ఖచ్చితంగా సినిమా కూడా అందరినీ మెప్పిస్తుందని నమ్మకంగా ఉన్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు.






