- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆడియన్స్‌కి మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది.. ‘కృష్ణ లీల’పై హీరో, డైరెక్టర్ కామెంట్స్
యంగ్ హీరో దేవన్ హీరోగా, ఆయన స్వీయ దర్శకత్వంలో రాబోతున్న సూపర్ నేచురల్ లవ్ స్టొరీ 'కృష్ణ లీల'.

దిశ, సినిమా: యంగ్ హీరో దేవన్ హీరోగా, ఆయన స్వీయ దర్శకత్వంలో రాబోతున్న సూపర్ నేచురల్ లవ్ స్టొరీ 'కృష్ణ లీల'. 'తిరిగొచ్చిన కాలం' అనే ట్యాగ్ లైన్‌తో రాబోతున్న ఈ మూవీలో ధన్య బాలకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్‌పై జోష్న జి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన రాగా.. పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఈ చిత్రం నవంబర్ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు డైరెక్టర్, హీరో దేవన్.
‘నేను సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూనే సినిమా ప్రయత్నాలు చేసేవాడిని. రెండు సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. ఆ తర్వాత అదే తరహా పాత్రలు రావడంతో కొత్త క్యారెక్టర్స్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు నిర్మాత జోష్న, రైటర్ అనిల్ ఈ కథ చెప్పారు. కథ విని ఒక వారం రోజుల తర్వాత ఈ జనరేషన్‌కి ఈ కథని ఎలా చెప్పొచ్చో కొన్ని మార్పులు చేసి ఒక కొత్త రకం స్క్రీన్ ప్లేతో చెప్పాను. అది వారికి చాలా నచ్చింది. నాకు డైరెక్షన్‌లో అనుభవం లేనప్పటికీ దీనికి నేనే డైరెక్ట్ చేస్తానని చెప్పాను. వాళ్లు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇక ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే.. కృష్ణ లీల.. తిరిగి వచ్చిన కాలం .. లీల అంటే ఆట. ఆయన ఒక ప్రేమ కథని ఎలా ఆడారు? ఎలా ఆడించారనేది కృష్ణ లీల. మనిషి కాలాన్ని వెనక్కి తిరిగి తీసుకురాలేడు. కానీ ఒక దైవత్వంతో కాలం మళ్ళీ తిరిగి వస్తే ఎలా ఉంటుంది అనేది చాలా ఆసక్తికరంగా చూపించడం జరిగింది. మన ప్రతి పనికి ఒక డెస్టిని ఉంటుంది. మనం కలిసే ప్రతి వ్యక్తితో మనకు ఒక అటాచ్మెంట్ ఉంటుంది. ఈ జన్మలో నీతో ప్రయాణించే ప్రతి వ్యక్తి గత జన్మలో నీతో అనుబంధం కలిగి ఉంటారు. వాళ్లకి ప్రేమని పంచు అనేది భగవద్గీత చెప్తుంది. ఇందులో ఆ ఎలిమెంట్‌ని చాలా కొత్తగా చూపించాం. ఓవరల్‌గా ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది అనే నమ్మకం ఉంది.. థియేటర్‌లో అందరూ ఎంజాయ్ చేస్తారు.. మా సినిమాకు కచ్చితంగా సపోర్ట్ చేస్తారు అనే నమ్మకం ఉంది.. ఆడియన్స్‌కి మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది’ అని చెప్పుకొచ్చాడు.
- Tags
- Krishna Leela






