యాక్షన్‌తో చెప్పిన లవ్ స్టోరీ.. డెకాయిట్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసిన హీరో కామెంట్స్

by Chukka Sudharani |

బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్న హీరో అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్‌లో డెకాయిట్‌'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

యాక్షన్‌తో చెప్పిన లవ్ స్టోరీ.. డెకాయిట్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసిన హీరో కామెంట్స్
X

దిశ, సినిమా: బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్న హీరో అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్‌లో డెకాయిట్‌'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గచిడ్ పాత్రలో కనిపించనున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 10న రాబోతున్నది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి అద్భుతమైన రెస్పాన్స్ రాగా.. షూటింగ్ పూర్తి చేసుకన్న సదర్భంగా సినిమా విశేషాలు పంచుకున్నాడు అడివి శేష్. ‘డెకాయిట్‌ ఒక కొత్త జోనర్‌లో చేసిన సినిమా. ఈ మధ్యకాలంలో మనం లవ్ స్టోరీస్ చెప్పడం మానేశాము. ఈరోజుల్లో అందరూ ఒక మంచి లవ్ స్టోరీ కోరుకుంటున్నారు. ఈ రోజుల్లో లవ్ స్టోరీనే యూనిక్. ఇది థ్రిల్లింగ్ యాక్షన్‌లో చెప్పిన లవ్ స్టోరీ. ఒక కొత్త జోనర్లో చేసిన ప్రయోగం. కథలో అవసరం ఉందంటే నేను ఏదైనా చేస్తాను. ఇందులో రుబారూ కూడా కథలో ఆ క్యారెక్టర్‌కి అవసరమైన సాంగ్. ఈ సినిమా అందరినీ ఎక్సయిట్ చేస్తుంది. సినిమా చివరకు వచ్చేసరికి అందరూ ఎమోషన్ అవుతారు. ఫ్యామిలీస్‌తో కలిసి చూడదగ్గ ఒక జెన్యూన్ ఫిలిమ్’ అని చెప్పుకొచ్చాడు.

Next Story