- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అనగనగా’ ఏడుపుగొట్టు సినిమా కాదు.. హీరో అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఏ అంచనాలు లేకుండా ఓటీటీలో రిలీజైన అనగనగా(Anaganaga) చిత్రం అందరి మన్ననలు పొందుతోంది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి రోజూ చర్చ జరుగుతూనే ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: ఏ అంచనాలు లేకుండా ఓటీటీలో రిలీజైన అనగనగా(Anaganaga) చిత్రం అందరి మన్ననలు పొందుతోంది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి రోజూ చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హీరో అడవి శేష్(Adivi Sesh) గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా శేష్ మాట్లాడుతూ.. ‘నా ఫస్ట్ సినిమా ఈవెంట్‌కి సుమంత్ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఇప్పుడు ఆయన సినిమా ఫంక్షన్‌కు నేను వచ్చాను. నా రియల్ లైఫ్‌లో సుమంత్(Sumanth) కొన్నిసార్లు వ్యాస్ సార్‌లా ఉంటాడు’ అని శేష్ చెప్పుకొచ్చారు. ఇక సినిమా తీసిన డైరెక్టర్‌ను నాతో ఒక సినిమా చేస్తారా? అని శేష్ పబ్లిక్‌గా అడిగారు. దీనికి అందరూ నవ్వులు పూయించారు. ఫైనల్‌గా అనగనగా.. ఏడుపుగొట్టు సినిమా కాదు.. అదొక లైఫ్ అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా చూసిన వారు ఎవరూ నిరాశ చెందరు. కచ్చితంగా కన్నీళ్లు వస్తాయి అని శేష్ అన్నారు.
సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో కాజల్ చౌదరి హీరోయిన్‌గా నటించింది. మాస్టర్ విహర్ష్, అవసరాల శ్రీనివాస్, అను హాసన్, రాకేశ్ రాచకొండ, బీవీఎస్ రవి, కౌముది నేమాని తదితరులు కీలక పాత్రలు పోషించారు. చందు రవి సంగీతం అందించారు. సన్నీ సంజయ్ దర్శకత్వం వహించగా, గడ్డం రాకేశ్ రెడ్డి, రుద్ర ముదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు.
నా ఫస్ట్ సినిమా ఈవెంట్ కి సుమంత్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు
— Filmy Focus (@FilmyFocus) May 23, 2025
నా రియల్ లైఫ్ లో సుమంత్ కొన్నిసార్లు వ్యాస్ సార్ లా ఉంటాడు
నాతో ఒక్కటే పెంట ఏంటంటే.. టైం పడుతుంది సినిమా తీయడానికి
అనగనగా ఏడుపుగొట్టు సినిమా కాదు #Anaganaga #Sumanth #KajalChoudhary #AdiviSesh pic.twitter.com/4jGPdsHTf3






