- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Akhanda 2: గూస్ బంప్స్ తెప్పిస్తోన్న కుంభమేళా సీన్స్ !
కుంభమేళా ఎపిసోడ్ మేకింగ్ వీడియోను తాజాగా పంచుకుంది. ఈ మూవీకి హైలైట్ గా నిలిచిన ఈ ఎపిసోడ్ ను,

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య తాజాగా నటించిన మూవీ అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ అఖండ 2 సినిమా బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి, 200 కోట్ల వైపు దూసుకు వెళ్తోందట. డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా, సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ లో కూడా దుమ్ము లేపుతోంది. ఈ సినిమాలో కుంభమేళా సీన్స్, హిందుత్వం, సనాతన ధర్మం గురించి స్టోరీ ఉన్న తరుణంలో నార్త్ ఇండియాలో కూడా జనాలు ఈ సినిమాను ఆదరిస్తున్నారు.
త్వరలో PM నరేంద్ర మోడీ కూడా ఈ మూవీని చూడబోతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో చిత్ర బృందం అదిరిపోయే వీడియోను రిలీజ్ చేసింది. అఖండ 2 సినిమాలో కుంభమేళా ఎపిసోడ్ మేకింగ్ వీడియోను తాజాగా పంచుకుంది. ఈ మూవీకి హైలైట్ గా నిలిచిన ఈ ఎపిసోడ్ ను, ఈ ఏడాది మొదట్లో జరిగిన కుంభమేళాలోనే షూట్ చేశారు. బాలయ్య, బోయపాటి శ్రీను ప్రస్తుతం నార్త్ లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కుంభమేళకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర బృందం. క్లిక్






