- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Manchu Family: మోహన్ బాబు ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు
మంచు మోహన్ బాబు(Mohan Babu) ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మంచు మోహన్ బాబు(Mohan Babu) ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. మనోజ్(Manchu Manoj) సామాగ్రిని తరలించేందుకు వాహనాలు సిద్ధం చేశారు. ఇకపైన తన ఇంటికి మనోజ్ రావడానికి వీళ్లేదని మోహన్ బాబు తేల్చి చెప్పారు. దీంతో మూడు వాహనాల్లో మనోజ్ వస్తువులు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ఎలాంటి గొడవలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. మంచు మనోజ్ దంపతులు ఇప్పటికే తెలంగాణ డీజీపీ జితేందర్(Telangana DGP Jitender), ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి(Intelligence Chief Shivadhar Reddy)ని కలిశారు.
తమకు అన్యాయం జరిగిందని వివరించారు. రక్షణ కల్పించాలని కోరారు. మరోవైపు ఈ ఉదయం జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్హౌస్ దగ్గర మంచు మనోజ్ బౌన్సర్లకు, మరో వైపు విష్ణు(Manchu Vishnu) బౌన్సర్లకు మధ్య గొడవ జరిగింది. మనోజ్ బౌన్సర్లను విష్ణు బౌన్సర్లు బయటకు పంపిస్తుండటంతో గొడవ స్టార్ట్ అయింది. మౌనికతో బౌన్సర్లు వీడియో కాల్ మాట్లాడారు. గొడవ జరుగుతుండటంతో గమనించిన మంచు విష్ణు బయటకి వచ్చి బౌన్సర్లను బయటకు తోసేశారు.
Also Read..
Manchu family fight: అతడి వల్లే మంచు ఫ్యామిలీలో తాజా గొడవలు.. సంచలన విషయాలు బయటపెట్టిన పనిమనిషి






