- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mohan Babu : మోహన్‌బాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా
తన మీద నమోదైన కేసులు కొట్టివేయాలని కోరుతూ నటుడు మోహన్‌బాబు(Mohan Babu) తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : తన మీద నమోదైన కేసులు కొట్టివేయాలని కోరుతూ నటుడు మోహన్‌బాబు(Mohan Babu) తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం. హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్(Pahadisharif PS)లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ నటుడు మోహన్‌బాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్(Quash Petition)పై విచారణను ధర్మాసనం జులై 3కి వాయిదా వేసింది. ఈ కేసులో మోహన్‌బాబుకు సుప్రీంకోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది.
ఆయన కుమారుడు మంచు మనోజ్ వ్యవహారంలో ఓ టీవీ రిపోర్టర్ ను తీవ్రంగా గాయపరిచిన ఘటనలో పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తదుపరి విచారణలో మోహన్‌బాబు తరపు వాదనలు, పోలీసుల ఆరోపణలను కోర్ట్ పరిశీలించనున్నట్టు సమాచారం. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం వల్ల మోహన్‌బాబు ప్రస్తుతం ఈ కేసులో తాత్కాలిక ఊరట పొందినప్పటికీ.., క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు కీలకం కానుంది.






