Sajid Khan : సినిమాలో ఒక్క ఛాన్స్ అంటూ వెళితే బట్టలు విప్పమన్నాడు : నటి కన్నీటి పర్యంతం

by Muthe.Rajitha |

ఓ ప్రముఖ దర్శకుడిని తన సినిమాలో ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడగటానికి వెళితే బట్టలు విప్పమని అసభ్యంగా మాట్లాడారంటూ ఓ నటి కన్నీటి పర్యంతం అయ్యారు.

Sajid Khan : సినిమాలో ఒక్క ఛాన్స్ అంటూ వెళితే బట్టలు విప్పమన్నాడు : నటి కన్నీటి పర్యంతం
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ ప్రముఖ దర్శకుడిని తన సినిమాలో ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడగటానికి వెళితే బట్టలు విప్పమని అసభ్యంగా మాట్లాడారంటూ ఓ నటి కన్నీటి పర్యంతం అయ్యారు. బాలీవుడ్ లో 'హే బేబీ', 'హౌస్ ఫుల్', 'హౌస్ ఫుల్ 2', 'హిమ్మత్ వాలా' వంటి చిత్రాలను తీసిన డైరెక్టర్ సాజిద్ ఖాన్(Director Sajid Khan) పై బాలీవుడ్ టీవీ సీరియల్ నటి నవీనా బోలె(Navina Bole) తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నవీనా.. 2004-06 మధ్య ఓ ప్రాజెక్టు గురించి మాట్లాడటానికి పిలిచారని వెళితే, తీరా అక్కడికి వెళ్ళాక తనను బట్టలు విప్పమన్నారని నవీనా ఆవేదన చెందింది. తనకు విషయం అర్థమై ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, ఇంటికి వెళ్లాల్సి ఉందని అక్కడి నుంచి బయటికి వచ్చానని తెలిపింది.

ఆ తర్వాత కూడా సాజిద్ తనను వదలలేదని.. ఎక్కడున్నావ్? ఎప్పుడు వస్తావని పలుమార్లు ఫోన్లో వేధించాడని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో మహిళలు అంటే ఆయనకు చిన్నచూపు ఉంటుందని, అందుకే ఆయన నాతో అలా ప్రవర్తించడాని తెలియజేసింది. ఇక జీవితంలో మళ్ళీ తనను కలవకూడదని నిర్ణయించుకున్నానని, ఆ ఘటన గుర్తు చేసుకుంటే ఇప్పటికీ వెన్నులో వణుకు వస్తుందని పేర్కొంది. తొలుత మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నవీనా.. పలు హిందీ హిట్ సీరియల్స్ లో నటించి, మెప్పించింది.

Next Story