- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాడిని అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిందే.. నెట్టింట దుమారం రేపుతున్న జాన్వీ కపూర్ సంచలన పోస్ట్..
మహారాష్ట్రలోని థానే జిల్లా కల్యాణ్‌లో చోటుచేసుకున్న హాస్పిటల్ దాడి ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని థానే జిల్లాలోని బాలచిత్కా క్లినిక్ అనే పిల్లల ఆసుపత్రిలో చోటుచేసుకున్న దాడి ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. గోకుల్ ఝా అనే వ్యక్తి తన తల్లిని చూపించేందుకు బాలచిత్కా క్లినిక్‌కు తీసుకువచ్చాడు. అప్పటికి డాక్టర్ డ్యూటీలో లేకపోవడంతో, రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న సోనాలి కలసరే అతనిని వేచి ఉండమని సూచించింది. క్యూలో ఉండాలని చెప్పిన ఆమె సూచనను పట్టించుకోకుండా, గోకుల్ డైరెక్ట్‌గా డాక్టర్ క్యాబిన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు.
ఈ సందర్భంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత వచ్చిన వీడియోల్లో, గోకుల్ ఝా రిసెప్షనిస్టు సోనాలిని జుట్టు పట్టుకుని లాగడం, కాలితో తన్నడం, కొట్టే దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ ఫుటేజ్‌పై తీవ్ర స్పందన వ్యక్తమైంది. మరో వీడియోలో, రిసెప్షనిస్ట్ సోనాలి కలసరే మొదటగా గోకుల్ తల్లిపై చెంపదెబ్బ కొట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దృశ్యం బయటకు రావడంతో దీనిపై సెలబ్రిటీలు, నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జాన్వీ కపూర్ కూడా స్పందించింది.
ఇలాంటి ప్రవర్తన సరైనదా, అవతిలి వ్యక్తిని ఎలా కొడతారు, మానవత్వం కూడా లేకుండా చేసిన ఈ పనికి ఎవరైన అతనితో కలిసి ఉంటారా? ఇది చాలా దుర్మార్గమైన చర్య.. ఇలాంటి వాటిని మనం ఏ మాత్రం క్షమించకూడదు. దీనిని ఖండించి అతడిని శిక్షించాల్సిందే. లేకపోతే మనకే సిగ్గు చేటు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకి పంపాలి అంటూ జాన్వీ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. 'ధడక్'(Dhadak) అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచమైన ఈ చిన్నది బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక తెలుగులో జాన్వీ ‘దేవర’(Devara) మూవీతో ప్రేక్షకులకు పరిచయం అయింది. తన ఫస్ట్ సినిమాతోనే మంచి ఫేమ్ తెచ్చుకోగా వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అలా ప్రజెంట్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana).. రామ్ చరణ్(Ram Charan) హీరోగా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’(Peddi) మూవీలో ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోపక్క నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.






