- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతను ముద్దిస్తావా అని అడిగాడు.. లోకల్ ట్రైన్‌లో ప్రభాస్ హీరోయిన్‌కు చేదు అనుభవం.. స్పందించిన ముంబై పోలీసులు.. (ట్వీట్)
‘బట్టం బోలే’(Battam bole) అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘పట్టం పోల్’(Pattam Pol) అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈ బ్యూటీ తన ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయిపోయింది. అలాగే తన నటనతో కూడా బాగా క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇందులో భాగంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సరసన ‘రాజా సాబ్’(Raja Saab) సినిమాతో మన ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి(Maruti) దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో మాళవికతో పాటు ప్రభాస్‌తో నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ది కుమార్(Riddi Kumar)లు కూడా రొమాన్స్ చేయబోతున్నారు. సంజయ్ దత్(Sanjay Dutt), అనుపమ్ ఖేర్(anupam Kher) వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి తమన్(Thaman) సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవికా మోహనన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా కాలేజ్ డేస్‌లో రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ముంబై లోకల్ ట్రైన్‌లో నా స్నేహితురాళ్లతో కలిసి ప్రయాణించాను. అప్పుడు మేము కూర్చున్న ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్ దాదాపు ఖాళీగా ఉందని, అప్పుడు ఒక వ్యక్తి కిటికీ గ్రిల్‌కు దగ్గరగా వచ్చి, ఏక్ చుమ్మా దేగి క్యా? (ఒక ముద్దు ఇస్తావా?) అని అసభ్యంగా అడిగాడు.
ఆ సమయంలో మేము ముగ్గురం పూర్తిగా నిస్సహాయంగా ఉండిపోయాము, ఏం చేయాలో తెలియక భయంతో వణికిపోయాము. సుమారు 10 నిమిషాల తర్వాత తదుపరి స్టేషన్ రావడంతో ప్రయాణికులు కంపార్ట్‌మెంట్‌లోకి రావడంతో మేమంతా ఊపిరి పీల్చుకున్నాము అని చెప్పింది. అయితే ఈ సంఘటన పై ముంబై పోలీసులు తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్పందించారు. డియర్ మాళవిక గారు.. “మీరు మీ అనుభవాన్ని పంచుకోవడం, నగరంలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేయడం మేము చూశాం. ఇలాంటి అనుభవాలు షాకింగ్‌గా ఉండటమే కాకుండా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తాయని మేము అర్థం చేసుకోగలం.
కాబట్టి, పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా, నగరంలో ఏ ప్రదేశంలోనైనా మీకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే, దయచేసి 112/100 నంబర్‌లకు కాల్ చేయండి. మేము వీలైనంత త్వరగా సహాయం అందిస్తాము. ఫిర్యాదు చేయకపోవడం వల్ల నేరస్థులు మరింత ధైర్యం పొందుతారు అని పోలీసులు తెలిపారు. ముంబై నగరం మహిళలకు ఎప్పుడూ సురక్షితమైనది, దానిని మరింత మెరుగుపరచడానికి మేము ఎటువంటి ప్రయత్నం వదిలి పెట్టము. ఒకసారి ఫిర్యాదు చేస్తే, నేరస్థుడిని చట్ట ప్రకారం తగిన విధంగా శిక్షిస్తామంటూ ముంబై పోలీసు విభాగం తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.






